Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి ప్రేమకథా నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగులో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
తనను మిషన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా తొలగించినందుకు వసు (Vasu) కోపంతో రగిలిపోతూ రిషి (Rishi) కారు ఆపి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అసలు మీ మనసులో ఏముంది అంటూ ప్రశ్నిస్తుంది.
211
వసు మాటలకు వెంటనే రిషి కి వసుకు శిరీష్ (Sireesh) తో ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయాన్ని తలచుకుంటాడు. రిషి (Rishi) మాత్రం ఎవరికీ సమాధానం చెప్పే అవసరం లేదు అంటూ తన పై అరుస్తాడు. వసు కూడా భయపడకుండా గట్టిగా మాట్లాడుతుంది.
311
రిషి (Rishi) వసు మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. వసు (Vasu) మాత్రం నీ మనసులో ఏముందో నిజం చెప్పే దాక ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు అంటూ మొండిగా ప్రవర్తిస్తూ అక్కడనే ఉండిపోతుంది.
411
ఇంట్లో జగతి (Jagathi), మహేంద్ర వర్మ (Mahendra Varma) వసు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటారు. ఇంటికి ఇంకా రాలేదు అంటూ ఏం జరిగిందో అంటూ మాట్లాడుకుంటారు. రిషి, వసు మధ్య గొడవలు పెద్దగా అవుతున్నాయని అనుకుంటారు.
511
వసుకు చాలా సార్లు చెప్పాను అంటూ కానీ అర్థం చేసుకోలేక పోతుందని జగతి (Jagathi) అంటుంది. రిషి (Rishi) కోపాన్ని తట్టుకోలేక అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసిందని బాధపడుతుంది. మహేంద్ర వర్మ కూడా బాధపడుతూ రిషి మొండితనం గురించి వివరిస్తాడు.
611
మహేంద్ర వర్మ వసు కోసం రిషికి (Rishi) ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ కట్ చేయడంతో కాస్త బాధ పడతాడు. వసు ఉద్యోగానికి రాజీనామా చేస్తే రిషితో అంత చనువుగా ఉండదని మహేంద్ర వర్మ (Mahendra) తన మనసులో అనుకుంటాడు.
711
వసు (Vasu) మాత్రం అక్కడే ఉంటూ రిషి తనను అన్న మాటలను తలుచుకుంటూ కోపంలో కనిపిస్తుంది. పైగా అక్కడ వర్షం పడేలా ఉన్నా కూడా వసు మాత్రం కదలకుండా అక్కడే ఉంటుంది. జగతి (Jagathi), మహేంద్ర వర్మ వసు గురించి టెన్షన్ పడుతూ ఉంటారు.
811
వసు (Vasu) కి ఏం జరిగిందో అంటూ బయట వాతావరణం బాగాలేదు అని ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని మహేంద్రవర్మ తో చెబుతుంది జగతి. మహేంద్ర వర్మ మళ్ళీ రిషికి (Rishi) ఫోన్ చేయాలని అనుకుంటాడు.
911
రిషి బెడ్ పై కూర్చొని వసు మాటలను తలచుకుంటాడు. మహేంద్రవర్మ (Mahendra) ఫోన్ చేయటంతో ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెడతాడు. వెంటనే మహేంద్రవర్మ రిషి ఫోన్ కట్ చేయడంతో కోపంతో రగిలిపోతాడు. ఇక ధరణికి (Dharani) ఫోన్ చేస్తాడు మహేంద్రవర్మ.
1011
రిషి గురించి కోపంతో అడగటంతో ధరణి (Dharani) టెన్షన్ పడుతుంది. వెళ్లి రిషి కి ఫోన్ ఇవ్వమని అనడంతో ధరణి ఫోన్ ఇవ్వడానికి వెళ్లగా రిషి కోపంతో అరుస్తాడు. మళ్ళీ ఫోన్ తీసుకోని మహేంద్రపై అరుస్తాడు. వసుధార (Vashudhara) ఇంటికి రాలేదనేసరికి రిషి షాక్ అవుతాడు.
1111
ఇక రిషి (Rishi) వెంటనే వసు ఉన్న చోట కి వెళ్లి రమ్మంటాడు. వసు మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నిజం చెప్పే దాకా కదలను అంటూ గట్టిగా చెబుతోంది. తరువాయి భాగంలో రిషి వసును శిరీష్ (Sireesh) తో పెళ్లి చేసుకుంటున్నావు కదా అని మనసులో మాట బయటపెడతాడు.