Karthika Deepam: అసలు నిజం ఆదిత్య ముందు బయటపెట్టిన మోనిత.. నడిరోడ్డుపై డాక్టర్ బాబుతో గొడవ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 16, 2021, 12:15 PM ISTUpdated : Nov 16, 2021, 12:16 PM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ( Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒకటే కథ  బాగా ట్విస్టులతో కొనసాగడంతో ఈ సీరియల్ మొదటి రేటింగు లో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Karthika Deepam: అసలు నిజం ఆదిత్య ముందు బయటపెట్టిన మోనిత.. నడిరోడ్డుపై డాక్టర్ బాబుతో గొడవ?

దీప (Deepa)తన బాధను అంతా దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అందరితో సంతోషంగా మాట్లాడుతున్నట్లు కనిపించటంతో అందరూ దీపను ఆశ్చర్యంగా చూస్తారు.
 

210

ఇక సౌందర్య, కార్తీక్ (Karthik) దీప ప్రవర్తన చూసి ఏంటి ఇలా కొత్తగా ప్రవర్తిస్తుందని అనుకుంటారు. ఆదిత్య (Aditya) కూడా ఇంత కొత్తగా కనిపిస్తున్నావు వదిన అనేసరికి దీప కూడా కొత్త కొత్త గా మాట్లాడుతుంది.
 

310

ఇక దీప (Deepa) సంతోషాన్ని చూసి పిల్లలు కూడా మురిసిపోతారు. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అమ్మ అంటూ సరదాగా మాట్లాడుతారు. ఇక దీప సంతోషంగా ఉండటమే కాకుండా కాస్త కొత్తగా మాట్లాడటంతో కార్తీక్, సౌందర్య (Soundarya) భయపడుతుంటారు.
 

410

దీప (Deepa) మాత్రం తను చేసిన వంటకాల రుచులు గురించి ఇంట్లో వాళ్ళందరిని మార్కులు అడుగుతుంది. ఇక కార్తీక్ ను కూడా అడగటంతో కార్తీక్ సమాధానం ఇస్తాడు. కానీ అబద్దం చెప్పావు అంటూ కార్తీక్ (Karthik) ను కాసేపు టెన్షన్ లో పడేస్తుంది.
 

510

మరోవైపు మోనిత (Monitha) ఇంట్లో హడావుడి చేస్తుంది. ప్రియమణితో ఇల్లు చక్క బెట్టమని గెస్ట్ వస్తున్నారంటూ  చెబుతుంది. ఇక ప్రియమణి (Priyamani) ఎవరు అని అడిగితే వచ్చేవరకు ఎదురు చూడమని చెబుతోంది.
 

610

ఇంతకు ఆ గెస్ట్ ఎవరో కాదు ఆదిత్య (Adithya). కార్తీక్ తన ఇంటికి వచ్చాడు అంటూ ఆదిత్యకు అబద్ధం చెప్పి తనను ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఆదిత్య వచ్చి కార్తీక్ కోసం వెతకడం తో మోనిత (Monitha) తాను కావాలని అబద్ధం చెప్పాను అని అనడంతో ఆదిత్య కోపంతో రగిలిపోతాడు.
 

710

ఇక మోనిత (Monitha) కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఆదిత్యకు అసలు నిజం చెబుతుంది. తనది ఆర్టిఫిషియల్ గర్భం కాదంటూ కార్తీక్ (Karthik) తాగిన మైకంలో తప్పు చేశాడు అంటూ కుటుంబం పరువు కోసం బయట పెట్టలేదని చెబుతుంది.
 

810

అంతేకాకుండా స్వయంగా హాస్పిటల్ కి వచ్చి భర్త స్థానం లో సైన్ చేశాడని గుడిలో దోష నివారణ పూజలో పాల్గొన్నాడని చెప్పడంతో ఆదిత్య (Adithya) షాక్ అవుతాడు. అంతా అబద్ధం చెబుతున్నావని చెప్పినా కూడా మోనిత (Monitha) గుడిలో దిగిన ఫోటోలను చూపిస్తుంది.
 

910

వెంటనే ఆదిత్య (Adithya) కోపంతో రగిలిపోతూ అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. ఎలాగైనా కార్తీక్ ను గట్టిగా నిలదీయాలని ఫిక్స్ అవుతాడు. దీప (Deepa) మాట్లాడిన మాటలను, మోనిత మాట్లాడిన మాటలను తలచుకుంటాడు.
 

1010

మధ్యలో కార్తీక్ (Karthik) కారు ఆగిపోవటంతో కార్తీక్ ను చూసి ఆదిత్య గట్టిగా నిలదీశాడు. ఇక కార్తీక్ బాధపడుతూ మోనిత చేసిన తప్పులను వివరిస్తాడు. అంతేకాకుండా గుడిలో పూజ జరిగేటప్పుడు దీప (Deepa) చూసిందని ఇక ఆ విషయాన్ని చెప్పలేక పోతున్నానని బాధ పడతాడు.

click me!

Recommended Stories