స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కొన్ని నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.... కానీ ఈ సమయంలో తన అభిమానుల కోసం ఓ ప్రాజెక్ట్ కు సామ్ వర్క్ చేసిందని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత Samantha గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ సామ్ చాలా క్రేజ్ దక్కించుకున్నారు. కెరీర్ లో అప్డేట్ అవుతూ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు.
26
చివరిగా విజయ్ దేవరకొండ Vijay Deverakonda సరసన ‘ఖుషి’ చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందుకు ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
36
కానీ ‘యశోద’ చిత్రం తర్వాత సామ్ అనారోగ్యానికి గురయ్యారు. వయోసైటిస్ వ్యాధితో బాధపడ్డాడు. దీని నుంచి కోలుకునేందుకు దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. యాక్టివ్ గా పబ్లిక్ అపీయరెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
46
అయితే సామ్ నుంచి సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నెక్ట్స్ ఎలాంటి సినిమాతో అలరించబోతుందని.. ముందు ఎలాంటి అనౌన్స్ మెంట్ రాబోతోందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
56
కానీ సమంత మాత్రం ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ అంటే సినిమా కాదండోయ్... హెల్త్ పాడ్ కాస్ట్ ను కంప్లీట్ చేసింది. హెల్త్ కు సంబంధించిన సమాచారం, ఉపయోగపడే విషయాలను ఆడియెన్స్ కు అందించబోతున్నారు.
66
ఈ పాడ్ కాస్ట్ వచ్చే వారంలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సమంత చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టుగా చెప్పారు. ఇదిలా ఉంటే... సమంత నుంచి నెక్ట్స్ క్రేజీ సిరీస్ ‘సిటాడెల్’ రానుంది. ఈ సిరీస్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.