Anasuya : మరోసారి భర్తతో కలిసి దేవాలయంలో అనసూయ... ఈసారి పూజలు ఎక్కడంటే?

Published : Feb 11, 2024, 07:28 PM IST

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ఆధ్యాత్మిక సేవతో ఆకట్టుకుంది. భర్తతో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించింది. పట్టువస్త్రాలతో తన అభిమానులకు పద్ధతిగా కనిపించింది. 

PREV
16
Anasuya : మరోసారి భర్తతో కలిసి దేవాలయంలో అనసూయ... ఈసారి పూజలు ఎక్కడంటే?

బుల్లితెరపై యాంకర్ గా దుమ్ములేపిన అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తోంది. మున్ముందు మరిన్ని చిత్రాలతో రాబోతోంది.

26

ఇదిలా ఉంటే.. అనసూయ స్మాల్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తన అభిమానులు ఆమె ప్రజెన్స్ ను ఎంతగానో మిస్ అయ్యారు. ఈ క్రమంలో అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. 

36

సినిమా అప్డేట్లను అందిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. ఎప్పుడూ నెట్టింట ఈ యాంకర్ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫ్యామిలీ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. 

46

గ్లామర్ ఫొటోలతో నెట్టింట మంటలు పుట్టిస్తూనే మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అనసూయ రీసెంట్ గా  ఎక్కువగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు. ఆ మధ్యలో శ్రీకాళ హస్తిశ్వరీలో కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజ నిర్వహించింది. 

56

తాజాగా భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా పట్టువస్త్రాలతో ఆలయ ఆవరణలో మెరిసింది. చీరకట్టులో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో వైరల్ చేస్తున్నారు. 

66

అనసూయను తన అభిమానులు ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లో నిండుగా చూసేందుకే ఇష్టపడుతుంటారు. కానీ రంగమ్మత్త మాత్రం నెట్టింట అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సెన్సేషన్ గా మారుతుంటుంది. ఇక నెక్ట్స్ వెండితెరపై ‘రజాకార్’, ‘పుష్ప2’తో అలరించబోతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories