ఈ వార్త వారిద్దరి ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులను సైతం కలచివేసింది. 11ఏళ్ల పరిచయం, నాలుగేళ్ళ వివాహబంధం ఇలా ముగియడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి తరువాత వీళ్ళ మధ్య విబేధాలు తలెత్తినట్లు ఒక్క కథనం కూడా వెలువడలేదు. ఒకవైపు పర్సనల్ లైఫ్, మరో ప్రక్క ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ, ఆదర్శ జీవనం సాగించారు.