ఇక సమంత అక్కినేని ఇండస్ట్రీల సరిహద్దులు చెరిపేసి దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల మనసు గెలుచుకుంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్2’తో ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, తమిళంలో ‘కాతువాకులా రెండు కాదల్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ సినిమాలో విజయ్‌సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటిస్తోంది. వాళ్లిద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని వెల్లడించింది.