పవన్ కళ్యాణ్ తో క్రిష్ భారీ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే గ్యాప్ లో క్రిష్, Vaishnav tej తో కొండ పొలం చిత్రాన్ని నిర్మించారు. ఇక Konda polam review మూవీ ఎలా ఉంది, మన నెటిజెన్స్ కామెంట్స్ ఏమిటని పరిశీలిస్తే... ప్రేక్షకులు చిత్రం పట్ల పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవల ఆధారంగా కొండపొలం మూవీ తెరకెక్కించారు. నేడు Konda polam వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఓ సామాజిక వర్గం జీవన విధానాన్ని కమర్షియల్ అంశాలు జోడించి క్రిష్ కొండ పొలం తెరకెక్కించారు. గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథ మధ్య అల్లి చెప్పారు. అదే సమయంలో అడవిలో గొర్రెలు కాపరులకు ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలు, వ్యతిరేక శక్తుల గురించి క్రిష్ ప్రస్తావించినట్లు తెలుస్తుంది.
మంచి చదువు వుండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, సాంప్రదాయ కుటుంబ గొర్రెల కాపరిగా మారిన యువకుడిగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తుండగా, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయిగా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. రెండు ఇన్నోసెంట్ ప్యూర్ క్యారెక్టర్స్ మధ్య, ప్రకృతిలో నడిచే అందమైన ప్రేమ కథ, సినిమాలో ప్రధానంగా నడిచినట్లు తెలుస్తుంది.
ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో కొండ పొలం సాగినట్లు ట్విట్టర్ కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది. కొండ పొలం మూవీకి సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్, బాగా ప్లస్ అయ్యింది. పాటలతో పాటు బీజీఎమ్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
కొండ పొలం మూవీపై మెగాస్టార్ చిరంజీవి మొదటి రివ్యూ ఇచ్చారు. ఆయన నిన్న రాత్రి సతీసమేతంగా స్పెషల్ స్క్రీన్ ద్వారా కొండ పొలం వీక్షించారు. అనంతరం ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయం తెలియజేశారు.
చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.దర్శకుడు క్రిష్ తో పాటు నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్ అన్నారు Chiranjeevi.