డైరెక్టర్‌ని హగ్‌ చేసుకున్న ఫోటో షేర్‌ చేసిన సమంత.. ఈ దెబ్బతో ఫుల్‌ క్లారిటీ వచ్చినట్టే

Published : Nov 07, 2025, 09:04 PM IST

హీరోయిన్‌ సమంత తాజాగా రాజ్‌ నిడిమోరుతో దిగిన ఫోటోలను పంచుకుంది. తమ బంధంపై మరింత క్లారిటీ ఇచ్చింది. ఇంతకంటే క్లారిటీ ఇంకా ఏం కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

PREV
15
మళ్లీ బిజీ అవుతోన్న సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత వెండితెరపై కనిపించి చాలా రోజులవుతుంది. చివరగా `ఖుషి` సినిమాతో బిగ్‌ స్క్రీన్‌పై మెరిసింది. ఆ మధ్య తాను ప్రొడ్యూస్‌ చేసిన `శుభం`లో కాసేపు గెస్ట్ గా మెరిసింది. తాను అనారోగ్యానికి గురి కావడంతో కొంత బ్రేక్‌ తీసుకుంది. దాదాపు రెండేళ్లు ఆమె సినిమాలకు దూరమైందని చెప్పొచ్చు. అయితే ఓ సిరీస్‌లోనూ కనిపించింది సమంత. కాకపోతే అది అంతకు ముందే షూట్‌ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఇటీవలే `మా ఇంటి బంగారం` మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉంది సమంత. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. 

25
రాజ్‌ నిడిమోరుతో సమంత లవ్‌

ఇదిలా ఉంటే తాజాగా సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత.. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు డేటింగ్‌ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని సమాచారం. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ ఇద్దరు స్పందించలేదు. ఖండించలేదు. దీంతో ఈ ఇద్దరి రిలేషన్‌ నిజమే అని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలకు తగ్గట్టుగానేఈ ఇద్దరు మీడియా ముందు క్లోజ్‌గా కనిపించారు. క్లోజ్‌గా ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. సమంతనే ఈ విషయంలో ముందుండటం విశేషం.

35
ప్రియుడితో ఈవెంట్‌లో మెరిసిన సమంత

అయితే ఇటీవల వీరికి సంబంధించిన వార్తలు తగ్గాయి. కానీ ఇప్పుడు మరోసారి  అగ్గి రాజేసింది సమంత. తాజాగా రాజ్‌ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను పంచుకుంది. ఆమె ముంబాయిలో ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. పర్‌ఫ్యూమ్‌కి సంబంధించిన ది ఆల్కెమిస్ట్ అనే బ్రాండ్‌ని లాంఛ్‌ చేసిన సందర్భంగా సమంత సందడి చేసింది. ఇందులో తమన్నా కూడా పాల్గొంది. వారితోపాటు రాజ్‌ నిడిమోరు, పలువురు వ్యాపారవేత్తలు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో సమంత ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

45
రాజ్‌ నిడిమోరుకి సమంత గట్టి హగ్‌

ఇందులో సమంత చెబుతూ, `గత ఏడాదిన్నర కాలంలో, నా కెరీర్‌లో నేను కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్ లు తీసుకున్నాను, నా అంతర్‌ దృష్టిని నమ్మడం, నా జర్నీలో చాలా విషయాలు నేర్చుకోవడం వల్లే ఇప్పుడు ఈ చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పని చేసే, అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసిపనిచేయడం ఆనందంగా, కృతజ్ఞతగా,  చాలా నమ్మకంగా ఉంది. ఇది నాకు ప్రారంభం మాత్రమే అని తెలుసు` అని పేర్కొన్నారు సమంత. ఈ సందర్భంగానే ఆయా ఫోటోలను పంచుకున్నారు.

55
ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి

ఈ ఫోటోల్లో రాజ్‌నిడిమోరుని ఆమెని హగ్‌ చేసుకుని కనిపించింది. ఇందులో వీరిద్దరి మధ్య ఆ ప్రేమ కనిపిస్తుంది. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో సమంత తమ బంధానికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చిందని, ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పినా ఆశ్చర్యం లేదంటూ వారు పోస్ట్ లు పెట్టడం విశేషం. దర్శకుడు రాజ్‌ నిడిమోరు `ది ఫ్యామిలీ మ్యాన్‌` సిరీస్‌తో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories