50 ఏళ్లలో కమల్ హాసన్ సంపాదించిన ఆస్తి విలువ ఎంతో తెలుసా? విలాసవంతమైన ఇల్లు, కార్ల వివరాలు

Published : Nov 07, 2025, 06:06 PM IST

కమల్ హాసన్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎంత సంపాదించారో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
కమల్ హాసన్ ఆస్తి వివరాలు

71 ఏళ్ల వయసులో కమల్ హాసన్ సంపద కేవలం నటనకే కాదు, ఆయన జీవితకాల పునరావిష్కరణకు అద్దం పడుతుంది. "కళత్తూర్ కన్నమ్మ" నుంచి "థగ్ లైఫ్" వరకు, ఆయన సినిమాలు, టీవీ షోలు, వ్యాపారాలు కోట్లను సంపాదించి పెట్టాయి. ఆయన నికర ఆస్తి విలువ రూ.450 కోట్లు.కమల్ హాసన్ 1975 నుంచి హీరోగా నటిస్తున్నారు. ఈ 50 ఏళ్లలో కమల్ హాసన్ సంపాదించింది రూ. 450 కోట్లు

25
Palatial Homes from Alwarpet to London

కమల్ హాసన్ కి అనేక నగరాల్లో, విదేశాల్లో హౌస్ లు ఉన్నాయి. చెన్నైలోని 60 ఏళ్ల ఆళ్వార్‌పేట భవనం, బోట్ క్లబ్ రోడ్‌లో రూ.92 కోట్ల స్కై-విల్లా ఉన్నాయి. ఇంకా చెన్నైలో ఏడు, మంగళూరు, బెంగళూరు, లండన్‌లో ఇళ్లు ఉన్నాయి.

35
లగ్జరీ కార్లు

రూ.2.82 కోట్ల లెక్సస్ ఎల్ఎక్స్ 570 నుంచి రూ.1.35 కోట్ల బీఎండబ్ల్యూ 730 ఎల్డీ వరకు కమల్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ రెండు వాహనాలకు "నాయకన్" సినిమా స్ఫూర్తితో కస్టమ్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి.

45
కమల్ హాసన్ ధరించే వాచ్ లు 

ఆయన చేతి వాచీలు కూడా ప్రత్యేకమే. రూ.42 లక్షల విలువైన కోరమ్ గోల్డెన్ బ్రిడ్జ్ క్లాసిక్, నటుడు సూర్యకు బహుమతిగా ఇచ్చిన రూ.47 లక్షల రోలెక్స్ డే-డేట్ వాచీలు ఆయన అభిరుచికి నిదర్శనం.

55
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. 'KH హౌస్ ఆఫ్ ఖద్దర్' ఫ్యాషన్ బ్రాండ్‌తో చేనేతకు చేయూతనిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories