కమల్‌ హాసన్‌ రిజెక్ట్ చేసిన సంచలనాత్మక మూవీస్‌.. ఇవే చేస్తే రజనీని మించిన స్టార్‌

Published : Nov 07, 2025, 07:40 PM IST

కమల్‌ హాసన్‌ ఎన్నో బ్లాక్‌ బస్టర్స్, సూపర్‌ హిట్‌ చిత్రాలు చేశారు. కానీ కొన్ని ఇండస్ట్రీ హిట్‌ మూవీస్‌ని ఆయన మిస్‌ చేసుకున్నారు. ఆ సినిమాలేంటో చూద్దాం. 

PREV
15
బర్త్ డే స్పెషల్‌గా రెండు సినిమాలు ప్రకటించిన కమల్‌

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నేడు(నవంబర్‌ 7) శుక్రవారం తన 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు సినిమాలను ప్రకటించారు. అందులో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ఓ మూవీ చేస్తున్నారు. సుందర్‌ సీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. దీన్ని తన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కమల్‌ కనిపిస్తారా? అనేది తెలియాలి. మరోవైపు యాక్షన్‌ డైరెక్టర్స్ అన్బరివ్‌ తో కమల్‌ హీరోగా ఓ మూవీని ప్రకటించారు. ఇది కూడా తన ప్రొడక్షన్‌లోనే తెరకెక్కుతుందని తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు కమల్‌. చాలా ఏళ్ల తర్వాత తన స్నేహితుడు రజనీతో ఆయన కలిసి పనిచేయబోతుండటం విశేషం.

25
కమల్‌ రిజెక్ట్ చేసిన సినిమాలు- రోబో

ఈ నేపథ్యంలో కమల్‌ హాసన్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కమల్‌ రిజెక్ట్ చేసిన మూవీస్‌ గురించి క్రేజీ విషయాలు వెల్లడయ్యాయి. అందులో భాగంగా పలు బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ ని ఆయన రిజెక్ట్ చేయడం గమనార్హం. ఆ సినిమాలేంటనేది చూస్తే, వీటిలో ప్రధానంగా నిలిచిన మూవీ `రోబో`. సౌత్‌లో సంచలనం సృష్టించిన ఈ సినిమాని మొదట కమల్‌ హాసన్‌ చేయాల్సింది. 2000లోనే కమల్‌తో ఈ సినిమా చేయాలనుకున్నారు దర్శకుడు శంకర్‌. కమల్‌, ప్రీతి జింటా కాంబినేషన్‌లో ప్రకటన కూడా వచ్చింది. కొంత భాగం షూట్‌ చేశారు. కానీ బడ్జెట్‌ సమస్య, ఆ తర్వాత కమల్‌ డేట్స్ సమస్య రావడంతో పక్కన పెట్టారు. అప్పట్లో ఇది పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ గా అనిపించడంతో అటు కమల్‌, ఇటు శంకర్ బ్యాక్‌ అయ్యారు. అదే కథని 2010లో రజనీకాంత్‌, ఐశ్వర్యా రాయ్‌ లతో రూపొందించారు శంకర్‌. ఈ మూవీ అప్పటి వరకు అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే రెండు నేషనల్‌ అవార్డులను సాధించింది. రజనీకాంత్‌ని తిరుగులేని సూపర్‌ స్టార్‌ని, ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ని చేసిందని చెప్పొచ్చు.

35
ఒకే ఒక్కడు

కమల్‌ హాసన్‌ రిజెక్ట్ చేసిన మరో మూవీ `ఒకే ఒక్కడు`. శంకర్‌ డైరెక్షన్‌లోనే ఈ సినిమా కూడా వచ్చింది. అర్జున్‌, మనీషా కోయిరాలా జంటగా నటించారు. రఘువరన్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. 1999లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు. ఈ సినిమాని శంకర్‌ మొదట కమల్‌తోనే చేయాలనుకున్నారు. కానీ అప్పటికే లోకనాయకుడు `హే రామ్‌` మూవీలో బిజీగా ఉన్నారు. అది అప్పట్లో భారీ చిత్రం. దీంతో `ఒకే ఒక్కడు`(ముధల్వాన్‌) వదిలేసుకోవాల్సి వచ్చింది. అర్జున్‌  ఓకే చెప్పడంతో ఈ మూవీ కమల్‌ నుంచి అర్జున్‌కి వెళ్లింది. ఆయన ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు.

45
జెంటిల్‌మేన్‌

కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రావాల్సిన మొదటి సినిమా `జెంటిల్‌మేన్‌`. `భారతీయుడు` కంటే ముందే ఈ సినిమాకి సంబంధించిన చర్చలు వీరి మధ్య జరిగాయి. కానీ అప్పుడు కమల్‌ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ మూవీ చేయలేకపోయారు. కొంత సమయం అడిగారట. కానీ శంకర్‌కి అర్జున్‌ ఓకే చెప్పడంతో వెంటనే ఆ మూవీని పట్టాలెక్కించారు. అలా కమల్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రావాల్సిన తొలి మూవీ `జెంటిల్‌మేన్‌` మిస్‌ అయ్యింది. ఈ సినిమాతో అర్జున్‌ స్టార్‌ హీరో అయిపోయారు. 1993లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఓ రకంగా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా శంకర్‌ దర్శకత్వంలోనే మూడు ఇండస్ట్రీ హిట్లని మిస్‌ చేసుకున్నారు కమల్‌.

55
మై హూ నా

వీటితోపాటు హిందీలో ఫరా ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన `మై హూ నా` మూవీ స్టోరీని కూడా ఆమె కమల్‌ కే మొదట చెప్పిందట. అయితే మెయిన్‌ విలన్‌ రోల్‌కి ఆయన్ని అడిగారు. కానీ ఆయన చేయలేదు. ఆ తర్వాత సునీల్‌ శెట్టి చేశారు. షారూఖ్‌ ఖాన్‌, సుస్మితా సేన్‌, జాయెద్‌ ఖాన్‌, అమృతా రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీలో సునీల్‌ శెట్టి విలన్‌గా నటించారు. ఈ సినిమా 2004లో విడుదలై బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. ఇలా కమల్‌ చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. కాకపోతే అందులో ఇలాంటి ఇండస్ట్రీ హిట్లని కమల్‌ మిస్‌ చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రాలు చేసి ఉంటే కమల్‌ స్టార్‌డమ్‌ పరంగా రజనీని మించిన స్టార్‌ అయ్యేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కమల్‌, రజనీ ఇమేజ్‌ పరంగా ఒకే స్థాయి లెజెండ్స్. కాకపోతే కమర్షియల్‌గా రజనీ మార్కెట్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories