Samantha:చైతన్యతో విడాకులు, ప్రాణం పోతుందని భయపడ్డ సమంత... మొదటిసారి షాకింగ్ విషయాలు చెప్పిన స్టార్ లేడీ

Published : Dec 07, 2021, 07:46 PM ISTUpdated : Dec 07, 2021, 07:48 PM IST

సమంత (Samantha)మొదటిసారి విడాకుల పై ప్రత్యక్షంగా స్పందించారు. నాగ చైతన్యతో విడాకుల ఘటన ఆమెను ఎంతటి మానసిక సంఘర్షణకు గురిచేసిందో... వెల్లడించారు. 

PREV
17
Samantha:చైతన్యతో విడాకులు, ప్రాణం పోతుందని భయపడ్డ సమంత... మొదటిసారి షాకింగ్ విషయాలు చెప్పిన స్టార్ లేడీ

సమంత-నాగ చైతన్య (Naga Chaitanya)విడాకుల ప్రకటన చేసి రెండు నెలలు దాటిపోయింది.ఇప్పటికీ ఈ విషయాన్ని అభిమానులు, సినిమా వర్గాలు నమ్మలేకపోతున్నారు. అసలు ఈ లవ్లీ కపుల్ సపరేషన్ కి కారణాలు ఏమిటి? వీరిద్దరికీ ఎక్కడ చెడింది? అనే విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. 
 

27

రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ నిజం ఏమిటో సమంత-నాగ చైతన్యలకే తెలుసు. కొద్దోగొప్పో వీరిద్దరి సన్నిహితులకు, క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు. ఏమి జరిగినా, కారణం ఏదైనా అది వాళ్ళిద్దరి పర్సనల్ విషయం. ఎవరి ప్రైవేట్ లైఫ్ వారికి ఉంటుంది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. 
 

37


కాబట్టి ఎంత సెలెబ్రిటీలు అయినప్పటికీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం సరికాదు. కాగా విడాకుల ప్రకటనకు ముందు నుండే సమంత నర్మగర్భంగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు.  విడాకుల అనంతరం ఆమె మరింతగా.. ఇంస్టాగ్రామ్ లో తన మనోభావాలు తెలియజేస్తున్నారు. 

47
samantha image


అయితే మొదటిసారి విడాకులపై స్పందించారు. విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితి ఏమిటో తెలియజేశారు. చైతూ తో విడాకులు తనను పూర్తిగా డిప్రెషన్ లోకి నెట్టివేసిందట. దీనితో తాను ఆ వేదనను ఎదిరించి నిలబడగలనా.. అసలు ప్రాణం నిలుస్తుందా? అనే భయం వెంటాడిందట. 

57

అయితే అంతటి కఠిన పరిస్థితులను ఎదిరించి నిలబడడంతో నేను కూడా స్ట్రాంగ్ అన్న భావన కలిగిందని సమంత ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విడాకుల విషయంలో మీడియా, జనాలు సమంతనే టార్గెట్ చేశారు. ఆమె ప్రవర్తన కారణంగానే చైతూ విడాకులు ఇచ్చారంటూ సోషల్ మీడియా ద్వారా వేధించారు. 

67

సమంత ప్రచారమవుతున్న పుకార్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ వినకుండా శృతిమించిన కథనాలు వెలువరించిన మీడియా సంస్థలపై న్యాయపోరాటం చేశారు. ఇక ఒంటరితనం నుండి వేదన నుండి బయటపడడం కోసం మిత్రులతో విహార యాత్రలు చేశారు. 

77
Samantha

ప్రస్తుతం సమంత తన ప్రొఫెషన్ లో బిజీగా మారారు. వరుస చిత్రాలు ప్రకటించడమే కాకండా... షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఆమె అల్లు అర్జున్(Allu Arjun) కి జంటగా ఓ ఐటెం సాంగ్ లో ఆడిపాడారు. అలాగే ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 

Also read `యశోద`గా సమంత.. ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ స్టార్ట్.. జోరు మామూలుగా లేదుగా!

Also read Samantha: `తలైవి`గా సమంత ట్రెండింగ్‌.. కొత్తగా లైఫ్‌ని ప్రారంభిస్తుందట.. లేటెస్ట్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?

Read more Photos on
click me!

Recommended Stories