సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్ బ్యూటీ.

Published : Mar 01, 2025, 04:38 PM IST

చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటోంది సమంత. బాలీవుడ్ లో సటిల్ అయ్యింది అనుకున్నారంతా. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చేయబోతుంది. 

PREV
15
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్ బ్యూటీ.

ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత కనిపించకుండాపోయింది సమంత. దాదాపు ఏడాదిన్నర రెండేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. వన్ ఇయర్ రెస్ట్ తీసుకుంటానంటూ ప్రకటించింది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ.. కొన్నాళ్ళు  కనిపించకుండాపోయింది. ఇక వచ్చీ రావడంమే బాలీవుడ్  వైపు చూసిన సమంత.. ముంబయ్ లోనే ఉంటూ.. సీటడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈసిరిస్ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. 

Also Read: కమల్ హాసన్ తో ఎఫైర్, భర్త వేధింపులు, ఆస్తి పేదలకు దానం చేసి మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

25

ఇక అప్పటి నుంచి  సౌత్ ఇండస్ట్రీని పట్టించుకోకుండా కొద్దిరోజులుగా హిందీ వెబ్‌సిరీస్‌లను మాత్రం చేసుకుంటుంది సమంత.  ఇక ఈ స్టార్ హీరోయిన్ ఎప్పుడు టాలీవుడ్‌లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తూ వచ్చారు. ఈక్రమంలో సమంత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  దీంతో ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోతోంది. 
 

Also Read:21 కోట్ల చెవి దుద్దులు, 700 కోట్ల ఆస్తులు, 4 ఏళ్లు మూవీస్ లేకున్నా మహారాణిలా లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ?

35

ఇంతకీ సమంత రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఏంటి.. డైరెక్టర్ ఎవరు అనే విషయంలో కూడా సెర్చింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. మయోసైటిస్‌ వ్యాధి.. కారణం ఏదైనా సౌత్ ఇండస్ట్రీకి సామ్ దూరం అయి చాలారోజులు అవుతోంది. విజయ్‌ దేవరకొండ ఖుషీ మూవీ తర్వాత.. తెలుగులో సమంత కనిపించిందే లేదు. ఒక్క సినిమా కూడా చేయలేదు. సిటాడెల్‌లాంటి వెబ్‌ సిరీస్‌లు మాత్రమే చేసింది. సమంత తన సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా ప్రొడ్యూస్‌ చేస్తోంది. 

Also Read:100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?

45

తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు స్క్రిప్ట్‌లు కూడా వింటోందట. మంచ్రి స్క్రిప్ట్ దొరికితే వెంటనే సినిమా చేసేందుకు  గ్రీన్ సిగ్నీల్ ఇవ్వడానికి రెడీగా ఉందట.  అంతే కాదు మంచి లవ్ స్టోరీ దొరికితే సినిమా చేయడానికి రెడీ అంటోంది సమంత. అలాంటి స్టోరీ కోసమే ఎదురుచూస్తోందని టాక్‌. ఇప్పటివరకు చాలామంది హీరోలతో జతకట్టిన సమంత.. హీరోయిన్ ఓరియెంటెడ్‌ కేరక్టర్స్‌ కూడా చేసింది. సమంత కెరీర్‌లో లవ్‌స్టోరీలు ది బెస్ట్‌గా నిలిచాయ్.

Also Read:ఎన్టీఆర్ , కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?

55

 దీంతో రీ ఎంట్రీకి కూడా అలాంటి స్టోరీస్‌నే చూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిందంట. సినిమాలు చేయకపోయినా..సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సమంత. సోషల్ మీడియాద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో  టచ్‌లో ఉంటుంది. తిరిగి వచ్చేయ్ బ్రో అని ఓ ఫ్యాన్ కామెంట్‌ చేస్తే.. వస్తున్నా బ్రో అంటూ.. ఇన్ స్టా గ్రామ్ ద్వారా కామెంట్ చేసింది సమంత. 

Also Read: బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?

Read more Photos on
click me!

Recommended Stories