రాజమౌళి, త్రివిక్రమ్ కాదు.. పూరి జగన్నాధ్ కొంచెం పాత రోజులు గుర్తు చేసుకో, ఇలా వార్నింగ్ ఇచ్చాడేంటి

Published : Mar 01, 2025, 03:26 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి యువ దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. కానీ కొందరు సీనియర్ దర్శకులు బాగా వెనుకబడ్డారు.

PREV
15
రాజమౌళి, త్రివిక్రమ్ కాదు.. పూరి జగన్నాధ్ కొంచెం పాత రోజులు గుర్తు చేసుకో, ఇలా వార్నింగ్ ఇచ్చాడేంటి
Trivikram Srinivas, Puri Jagannadh, Rajamouli

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి యువ దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. కానీ కొందరు సీనియర్ దర్శకులు బాగా వెనుకబడ్డారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాధ్ ప్రతిభ గురించి ఎవరికీ సందేహం అవసరం లేదు. 

 

25

మంచినీళ్లు తాగినంత సులభంగా పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ అందించారు. ఒకప్పుడు వరుసపెట్టి సూపర్ హిట్లు కొట్టారు. కానీ ఇప్పుడు పూరి జగన్నాధ్ కి ఏమాత్రం కలసి రావడం లేదు. ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ కి ఇస్మార్ట్ శంకర్ తప్ప సరైన హిట్ లేదు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ డిజాస్టర్లు పడ్డాయి. 

 

35

సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవికి అత్యధిక హిట్లు ఇచ్చిన దర్శకుడు కోదండ రామిరెడ్డి. ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కొంతమంది యువ దర్శకులు చాలా బాగా సినిమాలు చేస్తున్నారు అని కోదండ రామిరెడ్డి అన్నారు. 

 

45
Rajamouli

రాజమౌళి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశం మొత్తం ఆయన గురించి మాట్లాడుతోంది. నాకు బాగా ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ రచయిత కాకముందు నుంచే ఆయనతో పరిచయం ఉంది. పంచ్ డైలాగులని త్రివిక్రమ్ చాలా బాగా రాస్తారు. పాత అంశాలనే కొత్తగా చూపిస్తారు అని కోదండ రామిరెడ్డి అన్నారు. 

 

55

ఇక పూరి జగన్నాధ్ చాలా తెలివైన దర్శకుడు. చాలా మంచి సబ్జెక్టులు ఎంచుకుని వేగంగా సినిమాలు చేసేవాడు. ఒకప్పుడు చాలా బాగా చేశాడు. కానీ ప్రస్తుతం ట్రాక్ తప్పినట్లు ఉన్నాడు. ఆ మధ్యన పూరి జగన్నాధ్ ఒక ఫంక్షన్ లో కనిపించారు. సరదాగా వార్నింగ్ ఇచ్చా. నువ్వు బ్రహ్మాండమైన దర్శకుడివి, మళ్ళీ ఒకసారి పాతరోజులు గుర్తు చేసుకోవయ్యా అని చెప్పినట్లు కోదండరామిరెడ్డి తెలిపారు. మరి తన తదుపరి చిత్రంతో అయినా పాత పూరి జగన్నాధ్ ని చూస్తామో లేదో చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories