అమలని రోజా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఉన్న ఫోటోని చూపిస్తూ వీరిలో ఎవరు ఎక్కువ లేజీ అని రోజా అమలని ప్రశ్నించారు. అమల సమాధానమిస్తూ వాళ్లకంటే నేనే ఎక్కువ లేజీ అని సరదాగా బదులిచ్చింది. రోజా మరో ప్రశ్న అడిగారు.. ఈ ముగ్గురిలో ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్ అని ప్రశ్నించింది. కానీ అమల సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ కనిపించారు. వేదికపై అమలు సిగ్గుపడుతుండగా.. వేదిక కింద సమంత నవ్వుతూ ఉన్నట్లు చూపించారు. ఆ తర్వాత అమల హలో గురు ప్రేమకోసమే సాంగ్ కి డాన్స్ కూడా చేశారు.