హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా, పూనమ్ కౌర్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆమె అందించిన బహుమతి చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాంప్రదాయ చిత్ర కళ ఆధారంగా రూపుదిద్దుకున్న ఫ్రేమ్ ను ఆమె చంద్రబాబుకు అందించారు.. అందులో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించే కళాత్మక దృశ్యాలు, కలల రాజధాని రూపంలో ఆ ప్రాంతం ఎలా మారుతుందో వివరిస్తూ రూపొందించబడింది.