ఆరోగ్యం బాగోలేక దాదాపు ఏడాది వరకు సినిమాలకు దూరంగా ఉంది సమంత. ఏడాదికి పైగా ఆమె కనిపించకపోవడంతో అందరు ఇక సమంత పని అయిపోయింది అనుకున్నారు. బాలీవుడ్ లో సీటడెల్ వెబ్ సిరీస్ తో సందడి చేయగా.. ఇట టాలీవుడ్ ను మర్చిపోయింది అన్నారు. సమంత స్టార్ డమ్ పోయింది. వయస్సు కూడా పెరుగుతోంది, ఇక వెబ్ సిరీస్ లు క్యారెక్టర్ రోల్ చేసుకోవడమే అన్నారు. కాని తాజా సమాచారం ప్రకారం సమంత చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి వింటే నోటిమీద వేలేసుకోవాల్సిందే. దాదాపు 15 వందల కోట్ల బడ్టెట్ తో తెరకోక్కబోతున్న సినిమాల్లో ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది.
సమంత రీ ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతోందట. రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించి మెప్పించింది సమంత. మరోసారి రామ్ చరణ్ జోడీగా ఆమె నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు తో పెద్ది సినిమా బిజీలో ఉన్నాడు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కాగా ఆతరువాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు దాదాపు 700 కోట్లకుపైగా భారీ బడ్జెట్ ను ఖర్చు చేయబోతున్నారట.
ఈసినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలి అని అనుకుంటున్నారట. రంగస్థలం జోడీ రిపిట్ అయితే.. ఆ క్రేజ్ వేరే ఉంటుంది. సో సమంత ఈ సినిమాతో భారీ రీఎంట్రీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?
ఇక సమంత , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇక వీరి కాంబో కూడా మరోసారి కలవబోతున్నట్టు టాక్ . ఆ సినిమా మరేదో కాదు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్.
ఈ పాన్ ఇండియా మూవీని రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రకటించారు.సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సన్ పిక్చర్స్ దాదాపుగా 800 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేయబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుకు ప్రియాంక చోప్రా ను తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆమె రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈమూవీ చేయలేను అని చెప్పిందట.
ఇక ఆమె తరువాత ఈ కథను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల హీరోయిన్ సమంత అని అనుకున్నారట టీమ్. పైగా డైరెక్టర్ అట్లీ కూడా గతంలో సమంత తో ‘మెర్సల్’, ‘తేరి’ వంటి సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ కూడా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట.
lso Read:రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?
ఇక సమంత కూడా ఈ కథ విని బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్కచినట్టు తెలుస్తోంది. ఇక సమంత నాగచైతన్యతో విడాకులు తరువాత తన కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటుంది. మధ్యలో మయోసైటిస్ తో ఇబ్బందిపడినా.. ధైర్యంగా ఆ వ్యాధిని ఫేస్ చేసింది. చివరిగా తెలుగు ఆడియన్స్ కి ‘ఖుషి’ సినిమాలో చివరిగా కనిపించింది. ప్రస్తుతం సమంత పెళ్ళివార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడిని సమంత రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.