స్టార్‌ హీరో కొడుకుతో అనుపమా పరమేశ్వరన్‌ సీక్రెట్‌గా లవ్‌ ట్రాక్.. త్వరలో పెళ్లి?

Anupama Parameswaran Dating: అనుపమా పరమేశ్వరన్‌ `ప్రేమమ్‌` మూవీతో తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుసగా ట్రెడిషనల్‌ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. హీరోయిన్‌గానే కాదు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో గ్లామర్‌ కి గేట్లు ఎత్తేసింది. `టిల్లు స్వ్కేర్‌`లో ఆమెని చూసి అంతా షాక్‌ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే, అది నా ఇష్టం అంటోంది. లిప్‌ లాక్‌లు, ఎక్స్ పోజింగ్‌తోనూ దుమారం రేపిన అనుపమా ఇప్పుడు స్టార్‌ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందట. 

anupama Parameswaran secret love with star hero son they plan for marriage? in telugu arj
anupama parameswaran

Anupama Parameswaran Dating: అనుపమా పరమేశ్వరన్‌ `ప్రేమమ్‌` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో ఆ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో అదే రీమేక్‌ మూవీతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. అంతకంటే ముందే `అ ఆ`లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

anupama Parameswaran secret love with star hero son they plan for marriage? in telugu arj
Anupama Parameswaran

ఇక చివరగా ఆమె `టిల్లు స్వ్కేర్‌`లో లిల్లీగా మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తెలుగులో గ్యాప్‌ వచ్చింది. కానీ ఇటీవల తమిళంలో `డ్రాగన్‌`లో నటించి ఆకట్టుకుంది. పెద్ద హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్‌కి సంబంధించిన ఓ వార్త ఇటు సౌత్‌లో దుమారం రేపుతుంది.


anupama parameswaran dating with dhruv vikram

అనుపమా పరమేశ్వరన్‌ ఓ స్టార్‌ హీరో కొడుకుతో డేటింగ్‌లో ఉందట. గతంలో తెలుగు హీరోతో రూమర్‌ వచ్చింది. కానీ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు కోలీవుడ్‌ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందట.

స్టార్‌ హీరో కొడుకుతో ఆమె ప్రేమ వ్యవహారం నడిపిస్తుందట. ఆ స్టార్‌ హీరో ఎవరో కాదు విక్రమ్‌. ఆయన కొడుకు ధృవ్‌ తో అనుపమా ప్రేమలో ఉందట. చాలా కాలంగా రహస్యంగా ఈ లవ్‌ ట్రాక్‌కి నడిపిస్తున్నారట. 
 

anupama parameswaran dating with dhruv vikram

అంతేకాదు ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందట. తాజాగా కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ధృవ్‌, అనుపమా కలిసి `బిసన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బలపడిందని, అది పెళ్లి వరకు వెళ్తుందని తెలుస్తుంది.

త్వరలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుపమా `పరదా` అనే తెలుగు మూవీతోపాటు రెండు తమిళ చిత్రాలు, రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

read  more: కొడుకు మార్క్ శంకర్‌ ప్రాణాల కోసం మతం పక్కన పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ భార్య, తిరుమల శ్రీవారికి మొక్కు

also read: Good Bad Ugly 3 Days Collections: `డ్రాగన్‌`ను అధిగమించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`.. బాక్సాఫీస్ వద్ద రికార్డు!
 

Latest Videos

vuukle one pixel image
click me!