సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్, టాలీవుడ్ కలయికలో మరో కీలక చిత్రం రూపుదిద్దుకోనుంది.
25
సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ అభిమానులకు తెలియజేశారు.
35
ప్రాజెక్ట్‌పై ఆసక్తి
సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులో, “Dil, Dimag, Jigar se from this April with @directorvamshi and #DilRaju” అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు వంశీ పైడిపల్లితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ప్రకటనతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.
వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘మున్నా’, ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’, రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన ‘ఎవడు’..నాగార్జున, కార్తి నటించిన ‘ఊపిరి’, మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’,’ వంటి చిత్రాలు ఉన్నాయి.
55
బలమైన కంబ్యాక్ ఇవ్వాలని..
ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం ద్వారా మరో కీలక క్రాస్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.