దాదాపు 36ఏళ్లుగా సినిమాల్లో ఉన్న నటి హేమ ఇప్పటి వరకు 250-300కిపైగా చిత్రాలు చేసింది. `బాల గోపాలుడు`, `భలే దొంగ`, `జయమ్ము నిశ్చయమ్మురా`, `అగ్గిరాముడు`, `రౌడీగారి పెళ్లాం`, `క్షణం క్షణం`, `మనీ`, `వారసుడు`, `మెకానిక్ అల్లుడు`, `నువ్వు నాకు నచ్చావ్`, `మురారి`, `జయం మనదేరా`, `నీ స్నేహం`, `వసంతం`, `పల్లికిలో పెళ్లికూతురు`, `మల్లీశ్వరి`, `శ్రావణమాసం`, `అందరివాడు`, `సోగ్గాడు`, `అతడు`, `టాటా బీర్లా మధ్యలో లైలా` ఇలా అనేక చిత్రాలు చేసింది. ఇందులో `అతడు`లో ఆమె కామెడీ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆమె సినిమాల్లో కనిపించడం తగ్గింది. కానీ వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. మరి ఇకపై సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.