వసూళ్ల వేటాడుతున్న వీర ధీర సూరన్
వీర ధీర సూరన్ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా రెండో భాగాన్ని మొదట విడుదల చేసిన చిత్ర బృందం, మొదటి భాగాన్ని తర్వాత విడుదల చేయనున్నారు. ఈ సినిమా మొదటి రోజు కొంచెం ఆలస్యంగా విడుదల అయినా, పాజిటివ్ రివ్యూలు రావడంతో వెళ్లే కొద్దీ పిక్ అప్ అయి బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వేటాడుతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో వీర ధీర సూరన్ వసూళ్లు కొత్త శిఖరాన్ని తాకాయి.