Highest Paid Bigg Boss Host 2025: హిందీలో బిగ్‌బాస్ 19ని సల్మాన్ ఖాన్, తెలుగులో బిగ్‌బాస్ 9ని అక్కినేని నాగార్జున, మలయాళంలో బిగ్‌బాస్ 7ని మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్నారు. అయితే వీరిలో ఎవరు ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.
Highest paid Bigg Boss host in 2025: ఇండియా టెలివిజన్ హిస్టరీలో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవల్. హాలీవుడ్‌లో ఆవిర్భవించిన ఈ కాన్సెప్ట్ ఇండియన్ టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తొలుత హిందీలో మొదలై ఈ రియాలిటీ షో ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఓకే ఇంట్లో ఉంచి మనుషుల ప్రవర్తన, వారి మనస్తత్వాలు, చూపించే ఈ రియాలిటీ షోకు అపారమైన క్రేజ్ లభిస్తుంది. అదే సమయంలో విమర్శలు ఎన్ని వచ్చినా, బిగ్‌బాస్ షో మాత్రం టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతూ ప్రతి సీజన్‌కి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
25
హోస్టింగ్‌కు కోట్లు కొట్టేస్తున్న స్టార్ హీరోలు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బిగ్‌బాస్ ఫీవర్ మొదలైంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ ట్రెండింగ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ హ్యాష్‌ట్యాగ్‌లు కనిపిస్తున్నాయి. కేవలం హిందీలోనే కూడా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ విస్తరించి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ షోకు హోస్టింగ్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరోలు హోస్టింగ్ చేస్తున్నారు. వారి ఫేమ్ తో కూడా ఈ షోలు సక్సెస్ పుల్ గా రన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ స్టార్ హీరోలు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.
35
సల్మాన్ ఖాన్
హిందీలో బిగ్‌బాస్ అంటే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. గతంలో అనేక సీజన్లకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించి ఈ షోకు స్టార్ వాల్యూ తెచ్చారు. తాజా సీజన్ బిగ్‌బాస్ 19 కూడా సల్మాన్ ఖాన్ హోస్టింగ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ₹120 కోట్ల నుంచి ₹150 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టెలివిజన్ హోస్ట్‌గా రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి.
తెలుగులో బిగ్‌బాస్ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి రెండు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, న్యాచులర్ స్టార్ నాని లు హోస్ట్‌లు వ్యవహరించారు. ఆ తర్వాతి సీజన్లన్నింటికి కింగ్ నాగార్జునే హోస్ట్‌గా మారారు.
తన స్టైల్, గ్లామర్, మేనరిజంతో బుల్లితెరపై ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్టింగ్ కోసం నాగార్జున రూ 30 కోట్ల రెమ్యునరేషన్ అందనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
55
మోహన్‌లాల్
మరోవైపు మలయాళంలో బిగ్‌బాస్ అంటే మోహన్‌లాల్ గుర్తొస్తారు. 2018లో ప్రారంభమైన ఈ షోకు మొదటి నుంచీ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన వయసుకు తగ్గ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాబోయే బిగ్‌బాస్ మలయాళం 7 సీజన్ కూడా మోహన్ లాల్ లే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ లెటెస్ట్ సీజన్ కోసం మోహన్‌లాల్‌కు ₹7 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తం చూస్తే.. హోస్ట్‌గా అత్యధిక పారితోషికం అందుకుంటున్నది సల్మాన్ ఖానే. ఆయన తర్వాతి స్థానాల్లో అక్కినేని నాగార్జున, మోహన్‌లాల్ నిలిచారు. అంటే బిగ్‌బాస్ హోస్ట్‌లలో టాప్ పొజిషన్ సల్మాన్ ఖానే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.