Pawan Kalyan OG Movie: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న “ఓజీ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆసక్తిగా చూస్తున్న ప్రశ్న ఒక్కటే. పవర్ స్టార్‌ని వెంటాడుతున్న ఆ సెంటిమెంట్ కు బ్రేక్ అవుతుందా?
Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ బ్యాడ్ సెంటిమెంట్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న “ఓజీ” సినిమా మొదటి నుంచే భారీ అంచనాలు పెంచేసింది. ప్రీ-లుక్ పోస్టర్‌తోనే సినిమాపై ఆడియెన్స్, సినీ సర్కిల్స్‌లో భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆ తరువాత వచ్చిన మూవీ అప్డేట్స్ సినిమాపై భారీ అటెన్షన్ రప్పించగలిగారు. అంత బాగానే ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటీ? ఓజీ మూవీతో ఆ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా ?
25
ఓజీకి లైన్ క్లియర్
హరిహర వీరమల్లు నిరాశ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మాస్ ఆడియెన్స్‌కి సరికొత్త ఎనర్జీ ఇవ్వబోతున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “ఓజీ” దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. మొదట్లో బాలకృష్ణ–బోయపాటి కాంబోలో “అఖండ 2” కూడా దసరాకి వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆమూవీ వాయిదా పడింది. దసరా రేసు నుంచి తప్పుకుంది. దీంతో “ఓజీ”కి లైన్ క్లియర్ అయ్యింది.
35
కెరీర్‌లో మైలురాయి
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, సిరి లేళ్ల లాంటి నటీనటులు కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతుందనే ఫ్యాన్స్ తెగ నమ్ముతున్నారు.
సోషల్ మీడియాలో వైరలవుతున్న స్టోరీ లైన్ ప్రకారం.. “ఓజస్ గంభీర” అనే మాఫియా డాన్ పదేళ్ల తర్వాత మళ్లీ అండర్‌వరల్డ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, గతంలో తనకు ద్రోహం చేసిన ఓమి భావుని కూల్చి తన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా హస్తగతం చేసుకున్నాడన్నదే సినిమా కథ. పవన్ లుక్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లనున్నాయన్న బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన “సువ్వి సువ్వి” సాంగ్‌కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇక సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ, అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది.
55
సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజీ”లో రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్‌మెంట్ నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ గత అనుభవాలు మాత్రం అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందు పవన్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన “బాలు”, “పంజా” సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారాయి. ఇప్పుడు మూడోసారి అదే జానర్‌లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కు “ఓజీ” తో ఆ సెంటిమెంట్ బ్రేక్ పడుతుందా? లేక మళ్లీ అదే ట్రాక్ రిపీట్ అవుతుందా? అన్నది వేచిచూడాలి. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.