salman khan
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ముంబైలోని వర్లీలో రవాణా శాఖకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లో ఈ బెదిరింపు వచ్చింది. సల్మాన్ ఖాన్ కారును బాంబు పెట్టి పేల్చేస్తామని, సల్మాన్‌ను చంపేస్తామని ఆ మెసేజ్‌లో బెదిరించారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఎందుకు?
గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా బెదిరింపులు వచ్చాయి. 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసి ఈ ముఠా దాడి చేయబోతోందని తరచూ బెదిరింపులకు పాల్పడుతోంది. బిష్ణోయ్ సమాజానికి కృష్ణజింక మతపరంగా చాలా ముఖ్యమైనది. దాన్ని వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను ఆ సమాజం టార్గెట్ చేసింది.
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు
సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పులు
గత ఏడాది సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఇది జరిగి ఏడాది పూర్తవుతున్న సమయంలోనే ఇప్పుడు అదే ఏప్రిల్ 14న కొత్త వార్నింగ్ వచ్చింది. గత ఏడాది ఇదే రోజున సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిగాయి.
తెల్లవారుజామున నిద్రపోతున్నప్పుడు టపాసులు పేల్చినట్లు శబ్దం వచ్చిందని సల్మాన్ చెప్పాడు. తనను, తన కుటుంబాన్ని చంపడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని సల్మాన్ అన్నాడు.