suman
Hero Suman : సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా ఎదిగారు. చిరంజీవికి పోటీగా మూవీస్ చేశారు. కమర్షియల్‌గానూ విజయాలు అందుకున్నారు. అందం ఆయనకు స్పెషల్ ఎట్రాక్షన్. అదే ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది.
కానీ అదే సమయంలో కేసులో ఇరుక్కోవడంతో ఏడాదిపాటు సినిమాలకు దూరమయ్యారు సుమన్. పైగా కేసు పెద్దది కావడంతో ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. ఆ కేసు నుంచి క్లీన్ చీట్‌తో బయటకు వచ్చినా అప్పటికే కెరీర్ పరంగా జరగాల్సిన నష్టం జరిగింది. మునుపటి ఊపు లేదు, సినిమాలు లేవు, థియేటర్లలో ఆదరణ దక్కలేదు.
actor suman
సుమారు ఏడాదిపాటు జైల్లో ఉన్న సుమన్ ఆ తర్వాత బయటకు వచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. అయితే ఈ సారి రెట్టింపుగా మూవీస్ చేశారు. డబ్బుల కోసం కథ ఏంటి? దర్శకుడు ఎవరు అనేది చూసుకోలేదు. ఒకేసారి పదికిపైగా సినిమాలకు ఓకే చెప్పారట.
ఏక కాలంలో అన్ని సినిమాల షూటింగ్‌లు చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ షూటింగ్ కి వచ్చేవారు కాదట. ఒక్కో మూవీకి మూడు నాలుగు రోజులు వస్తే, మళ్లీ ఆయన షూటింగ్‌లకు రావడానికి నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేదట. దీంతో సినిమాలు డిలే అయి నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వచ్చిందట.
mallidi satyanarayana reddy (telugu one )
తాజాగా ఈ విషయాలను దర్శక,నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సుమన్ హీరోగా ఆయన ఓ మూవీని తీశారు. దీనికి సత్యమూర్తి దర్శకుడు. సినిమా ప్రారంభమైన వారం పది రోజులకు సుమన్ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్లాడు. బయటకు రావడానికి ఏడాది పట్టింది.
ఆ తర్వాత సినిమా షూటింగ్‌లకు వస్తాడని రెడీ అయి ఉంటే, వచ్చేవాడు కాదట. నాలుగైదు రోజులు వచ్చి మళ్లీ నెలల తరబడి గ్యాబ్ వచ్చేదట. అలా సినిమా కంప్లీట్ కావడానికి ఐదేళ్లు పట్టిందట. ఐదేళ్ల తర్వాత రిలీజ్ చేస్తే ఆ మూవీ ఆడలేదు, బాగా లాస్ వచ్చిందన్నారు సత్యనారాయణరెడ్డి. ఇలా చాలా నిర్మాతలకు ఇబ్బంది అయ్యిందన్నారు.