నీకు నచ్చింది నువ్వు చేసుకో కానీ కాలేజ్ కి, ఇంటికి, వసుధారకి ఏ సమస్య వచ్చినా సరే ఇంట్లో అందరం ఒకటయ్యాము. నువ్వు ఏం చేయలేవు అని దేవియాని అంటుంది.అప్పుడు సాక్షి, ఇంకో రెండు రోజుల్లో మాకు లగ్నపత్రికలు రాకపోతే మీరే నా చావుకు కారణం అనే విషయం తాగి ఇక్కడ చచ్చిపోతాను అని బెదిరించి, మీ కుటుంబం అందరినీ నాశనం చేయకపోతే నా పేరు సాక్షి కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో,రిషికి ఆ కారులో ఏమైందో అర్థం కాక ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు.