సౌందర్య కంగారుగా సౌర్య దగ్గరికి వెళ్లి,ఏమైందమ్మా? నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? అని అడగగా, శౌర్య కోపంతో ఆటో నడుపుకునే దాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు! అనా నీ ఉద్దేశం,అని అడుగుతుంది. అప్పుడు సౌందర్య, నేను ఆ విధంగా అనలేదు,సరే ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయండి అని చెప్తుంది. దాని తర్వాత ప్రేమ్ జోక్ వేస్తాడు. ఇంట్లో వాళ్ళు నవ్వరు. ఈలోగా స్వప్న అక్కడికి వచ్చి కోపంతో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అని అరుస్తుంది.