టాలీవుడ్ స్టార్ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు... బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన ఆరోపణలు 

Published : Aug 04, 2022, 08:50 AM ISTUpdated : Aug 04, 2022, 02:01 PM IST

హీరోయిన్ రాధికా ఆప్టే సంచలనాలకు మారు పేరు. ముక్కుసూటిగా మాట్లాడే రాధికా కామెంట్స్ పలు మార్లు పతాక శీర్షికలు ఎక్కాయి. గతంలో ఓ టాక్ షోలో రాధికా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆమె చెప్పడం సంచలనం రేపింది.

PREV
16
టాలీవుడ్ స్టార్ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు... బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన ఆరోపణలు 

ఆ సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ... ఆ తెలుగు సినిమాలో నాది మొదటి రోజు షూట్. నేను బెడ్ పై పడుకొని అనారోగ్యంగా ఉన్న సీన్ చిత్రీకరిస్తున్నారు. సెట్ లో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఆ హీరో నా కాలు గిల్లాడు. ఆయన ఓ పెద్ద స్టార్. పరిశ్రమలో బాగా పలుకుబడి ఉన్న హీరో అని నాతో అంతకు ముందే చెప్పారు.

26


అయినప్పటికీ నేను ఊరుకోలేదు. నాతో మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగోదని గట్టిగా చెప్పాను.. అంటూ రాధికా అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగులో రాధికా ఆప్టే రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో రాధికాతో తప్పుగా ప్రవర్తించిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరా? అని అందరూ ఆలోచిస్తున్నారు. 

36


ఇక రాధికా చేసిన ఆ కామెంట్స్ బాలకృష్ణ గురించేనని తెలుస్తుంది. టాలీవుడ్ లో రాధికా జతకట్టిన టాప్ హీరో బాలయ్య మాత్రమే. ఆయనతో రాధికా లెజెండ్, లయన్ చిత్రాలలో నటించారు. టాప్ హీరో, పలుకుబడి కలిగిన హీరో అంటూ ఆమె ఇచ్చిన హింట్స్ నేరుగా బాలయ్యను గుర్తు చేస్తున్నాయి. దీంతో పరోక్షంగా రాధికా ఆప్టే బాలయ్య గురించే చెప్పినట్లు అయ్యింది. 2018లో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

46

ఇక పరిశ్రమకు వచ్చిన కొత్తలో తన శరీరంపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారని రాధికా ఆప్టే చెప్పడం విశేషం. హీరోయిన్ గా పరిశ్రమలో ఎదగాలంటే చెస్ట్, ముక్కు, థైస్, బటక్స్ వంటి శరీర భాగాలకు సర్జరీలు చేయించుకోమని కొందరు రాధికకు సలహాలు ఇచ్చారట. అయితే అవేమి నేను చేయించుకోలేదని రాధికా తెలియజేశారు.

56

చెస్ట్ చిన్నగా ఉందని ఓ మూవీ నుండి తనను తప్పించినట్లుగా కూడా ఆమె తెలియజేశారు. తన స్థానంలో ఆకర్షణీయంగా ఉన్న మరొక హీరోయిన్ ని తీసుకున్నట్లు రాధికా తెలియజేశారు. ఇక బోల్డ్ హీరోయిన్ గా పేరున్న రాధికా న్యూడ్ గా నటించి సంచలనం రేపారు. అప్పట్లో ఆ మూవీ గురించి జనాలు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. 
 

66


ప్రస్తుతం రాధికా విక్రమ్ వేద హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. హ్రితిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు చేస్తుండగా చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించగా మంచి హిట్ అందుకుంది. పుష్కర్-గాయత్రీ దర్శకత్వం వహిస్తున్నారు. 

click me!

Recommended Stories