ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని(devayani), మహేంద్ర దంపతులు గౌతమ్ కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా అప్పుడు మహేంద్ర కాఫీ బాగుంది అని ధరణిని పొగుడుతూ ఏంటి ఈ మార్పు అని అనగా ఇదే కాదు మహేంద్ర చాలా విషయాలలో చాలామంది ఇంట్లో మారిపోయారు అనడంతో వెంటనే మహేంద్ర మార్పు సహజమే కదా వదిన అంటూ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత మహేంద్ర, ధరణి( Dharani)అందరూ కలిసి దేవయానిని ఒక ఆట ఆడుకుంటారు.