ఇక శ్రీముఖి ఇటీవల ఎక్కువగా వెకేషన్స్ కి వెళుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీముఖి యుఎస్ టూర్ వెళ్ళింది. శ్రీముఖితో పాటు ఆమె ఫ్రెండ్స్.. సింగర్ సాకేత్, శేఖర్ మాస్టర్, మంగ్లీ కూడా యుఎస్ టూర్ వెళ్లారు. తొలిసారి శ్రీముఖి ఎమిరేట్స్ విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినట్లు పేర్కొంది. తన ఫ్లైట్ జర్నీ విశేషాలని శ్రీముఖి సెల్ఫీ వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది.