మరొకవైపు శోభ(shobha)ఒకవైపు బ్యాంకు వాళ్ళు బెదిరిస్తున్నారు, మరొకవైపు నిరుపమ్ పని కూడా అవ్వట్లేదు అనే కోపంతో రగిలిపోతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు స్వప్న అన్న మాటలు తలుచుకొని మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది శోభ. మరొకవైపు హిమ,కార్తీక్,దీప ల ముందు నిలబడి సౌర్య(sourya) గురించి చెప్పుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య అక్కడికి వచ్చి ఏం జరిగింది హిమ అని అనగా నిరుపమ్ బావ వచ్చి సౌర్య గదిలోకి వెళ్ళాడు నానమ్మ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందని భయంగా ఉంది అనడంతో సౌందర్య ఆలోచనలో పడుతుంది.