వాటిని ఈరోజు రాత్రికి చదివి రేపు ఉదయం కల్లా నాకు చెప్పు అని అంటాడు. అప్పుడు వసు మనసులో, రిషి సార్ కి నేనంటే ఎంత జాగ్రత్త అని అనుకుంటుంది. ఈ లోగ రిషి, వసు చేయ పట్టుకొని 10000 రూపాయలు ఇచ్చి నీకు డబ్బు అవసరం ఉందని మేనేజర్ చెప్పారు. అది ఎందుకో నాకు అనవసరం కానీ భవిష్యత్తులోనికి ఏ డబ్బు అవసరమైనా సరే నన్నే అడగాలి. ఇంక ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు తిరిగి మేనేజర్ కి ఇచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రోజు ఉదయం రిషి, వాసుధారకు ఫోన్ చేద్దామా? కారణం లేకుండా ఫోన్ చేస్తే బాగోదేమో అని అనుకుంటాడు. ఇంతట్లో గౌతమ్ అక్కడికి వస్తాడు అదే సమయంలో వసు, రిషికి ఫోన్ చేయగా గౌతమ్ లాక్కొని మాట్లాడుతాడు.