ఎక్కడికి అని శౌర్య అడగగా సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాము అని అంటారు. నాకు రావాలని లేదు అని సౌర్య అంటుంది.దానికి వాళ్లు ఏది ఏమైనా శుక్రవారం సెకండ్ షో సినిమాకి వెళ్లకపోతే మాకు ముద్ద దిగదు బంగారం అని అంటారు. ప్రతిదానికి వద్దు అంటే వీళ్ళు బాధపడతారు, ఇష్టం లేకపోయినా వెళ్లాలి అని శౌర్య మనసులో అనుకొని సరే వెళ్దాము అని అంటుంది. ఆరోజు రాత్రి దీప బయట కూరగాయలు కొంటూ ఉంటుంది. అదే సమయంలో వెనకాతల సౌర్య, ఇంద్రుడు, చంద్రుడు తో బట్టల షాప్ దగ్గరికి వెళ్తుంది.