స్నేహానికి రిచ్, పూర్ అన్న భేదాలు ఉండవు.. డబ్బు, కులం లాంటివి అడ్డురావు. అందుకు మంచి ఉదాహరాణం ప్రభాస్ అతని ఫ్రెండ్స్ తనకంటే తక్కవ స్థాయిలో ఉన్నా.. ఆయన స్నేహంలో ఏమాత్రం తేడా రాదు. జబర్దస్త్ లో ఒక కమెడియన్ ప్రభాస్ కు మంచి ఫ్రెండ్ అని మీకు తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ప్రభాస్ ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన ఒక్క సినిమాకు 100 నుంచి 150 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి.. ఈ రేంజ్ కు ఎదిగిన ప్రభాస్.. తన స్నేహితులను మాత్రం మర్చిపోడు.. కెరీర్ బిగినింగ్ లో తనతో కలిసి ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ తో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అయితే జబర్థస్త్ లో ఒక సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు మంచి స్నేహితుడని మీకు తెలుసా? ఇంతకీ ఆయన ఎవరు?
25
జబర్దస్త్ కమెడియన్.. ప్రభాస్ ఫ్రెండ్
ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో తనతో నటించిన వారిని మర్చిపోలేదు.. ఎంత స్టార్ హీరో అయినా.. తనతో ట్రావెల్ చేసిన వారిని గుర్తుపెట్టుకున్నాడు. జబర్దస్త్ లో ఒక సాధారణ కమెడియన్ గా ఉన్న అదిరే అభి. జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా గుర్తింపు సాధించిన అభి.. అంతకు ముందు నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. రకరకాల విభాగాలలో పనిచేశాడు. నటుడిగా, దర్శకుడిగా, రైటర్ గా అభికి అనుభవం ఉంది. కెరీర్ బిగినింగ్ లో ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ లో.. హీరో ఫ్రెండ్ బ్యాచ్ లో మెయిన్ పర్సన్ గా అభి కనిపించాడు. అప్పుడు వారి మధ్య స్నేహం మొదలయ్యింది. ఆతరువాత కాలంలో కూడా వీరి స్నేహం కొనసాగింది. ప్రభాస్ స్టార్ హీరో అయిన తరువాత కూడా అప్పుడప్పుడు అభి కనిపిస్తే గుర్తుపట్టి మరీ పలకించేవాట.
35
రెమ్యునరేషన్స్ గురించి గుర్తు చేసుకున్న అభి..
ప్రభాస్ నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’లో తనకు అందిన పారితోషికం గురించి అభి తాజాగా వెల్లడించారు. రీసెంట్ గా తన దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘చిరంజీవ’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభి మాట్లాడుతూ.. ప్రభాస్ కెరీర్ ప్రారంభ దశలో ఆయనతో కలిసి నటించిన వారికి అందిన పారితోషికం ఎంత అనే విషయాన్ని వెల్లడించారు. నిర్మాత అశోక్ కుమార్ ఈ సినిమా కోసం తనకు కేవలం 11 వేల రూపాయల చెక్ ఇచ్చారని.. అదే తన సినీ జీవితంలో నటుడిగా పొందిన తొలి పారితోషికమని ఆయన అన్నారు. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో తన మొదటి సినిమా చేయడం, అదే సమయంలో అందుకున్న పారితోషికం 11 వేలు జీవితంలో మర్చిపోలేనని స్టార్ కమెడియన్ అన్నారు.
అభి తన కెరీర్‌ను డ్యాన్స్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు... కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే, దర్శకత్వ విభాగంలో కూడా అనుభవం సంపాదించాడు. జబర్దస్త్ షోలో టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అభి, ఆ తర్వాత కమెడియన్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా, హీరోగా కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. అభి సినీ పరిశ్రమలో నటుడిగా చేసిన తొలి సినిమా ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’. ఈ సినిమా 2002లో విడుదలైంది.
55
స్టార్ డైరెక్టర్ కు సహాయం చేసిన అభి
1997లోడాన్స్ మాస్టర్ గా తన మొదటి సంపాదన 50 రూపాయలని అభి గుర్తుచేసుకున్నాడు. అక్కడి నుంచి ఈ స్థాయికి చేరుకునే వరకు తన ప్రయాణం ఎంతో కష్టంగా సాగిందని కష్టమైందని, అనేక రంగాల్లో పని చేస్తూ సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నానని అభి అన్నారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అభికి చాలామంది స్టార్స్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అభికి క్లోజ్ ఫ్రెండ్. గతంలో అనిల్ రావిపూడికి కొన్ని సినిమాలకు సహాయం కూడా చేశాడు అభి.