ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి `వార్ 2`లో నటించాడు. ఈ సినిమా ఆడలేదు. కానీ ఇప్పుడు మరో మూవీ చేయబోతున్నారట. షారూఖ్ ఖాన్‌తో మరో మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయ్యారట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి `వార్ 2`లో నటించారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన `వార్ 2` ఆగస్ట్ 14న విడుదలై ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే.
25
`వార్ 2` ఫ్లాప్స్ తో అన్నీ పక్కన పెట్టిన తారక్
ఈ సినిమా ప్రభావంతో మరో యష్ రాజ్ ఫిల్మ్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు తారక్. సోలో హీరోగా మూవీ చేయాల్సి ఉండగా, దాన్ని పక్కన పెట్టారు. అదే కాదు `దేవర 2`ని కూడా పక్కన పెట్టినట్టు సమాచారం. అంతేకాదు ప్రశాంత్ నీల్‌తో చేస్తోన్న `డ్రాగన్` మూవీని కూడా రీ షూట్‌కి వెళ్తున్నారు. కొత్తగా రిస్క్ చేయడానికి రెడీగా లేరు తారక్. నెల్సన్ తో మూవీని కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరో మల్టీస్టారర్‌కి రెడీ అయ్యారట.
35
పటాన్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న షారూఖ్
షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందిన `పటాన్` మూవీ రెండేళ్ల క్రితం వచ్చి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఏకంగా వెయ్యి కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. బాక్సాఫీసుని షేక్ చేసింది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అనేక పరాజయాలతో ఉన్న షారూఖ్ ఖాన్‌ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత `జవాన్`తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చేసిన `డంకీ` మూవీ యావరేజ్‌గా ఆడింది. ఇప్పుడు `కింగ్` మూవీతో రాబోతున్నారు షారూఖ్.
అనంతరం `పటాన్ 2` చేయబోతున్నారు షారూఖ్ ఖాన్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గానే ఇది రూపొందుతుంది. ఇందులో కీలక పాత్ర కోసం ఎన్టీఆర్‌ని అప్రోచ్ అయ్యారట. ఆయన కూడా చేసేందుకు సుముఖతని వ్యక్తం చేశారట. సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ `విక్రమ్` పాత్రలోనే కనిపించబోతున్నారట. `వార్ 2`లోనూ ఏజెంట్ విక్రమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే పాత్రని `పటాన్ 2`లో చేయబోతున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది, ఇప్పుడు అదే సిరీస్‌లో వస్తోన్న `పటాన్ 2`లో తారక్ నటించబోతుండటం ఆశ్చర్యకంగా మారింది.
55
డ్రాగన్ 2తో బిజీగా ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది 1970 బ్యాక్ డ్రాప్‌లో సాగే గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది. ఇందులో మాఫియా డాన్‌గా తారక్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసమే ఆయన చాలా సన్నగా మారిపోయారు. ప్రారంభంలో తీసిన కంటెంట్ సరిగా రాకపోవడంతో ఆ ఫూటేజ్ అంతా పక్కన పెట్టిన కొత్తగా మళ్లీ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.