సాయిపల్లవికి అదిరిపోయే ఛాన్స్ దక్కింది. ఆమె సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు దీపికా పదుకొనె స్థానంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
నేచురల్ అందంతో ఆకట్టకుంటుంది సాయిపల్లవి. చాలా వరకు మేకప్ కి దూరంగా ఉంటుంది. అయినా అందం విషయంలో ఏమాత్రం తగ్గెదెలే అంటోంది. అద్భుతమైన నటనతో మ్యాజిక్ చేస్తుంది సాయిపల్లవి. తెరపై ఎంత మంది ఆర్టిస్ట్ లు ఉన్నా, ఆమెనే కనిపిస్తుంటుంది. అంతగా సహజమైన యాక్టింగ్‌తో మెప్పిస్తుంది. అంతే అద్భుతమైన డాన్సులతో అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సాయిపల్లవికి మరో బంపర్ ఆఫర్ వరించింది.
25
`కల్కి 2898 ఏడీ` నుంచి దీపికా ఔట్
దీపికా పదుకొనె స్థానంలో హీరోయిన్‌గా నటించే ఆఫర్ సాయిపల్లకి వచ్చింది. దీపికా పదుకొనె `కల్కి 2898 ఏడీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. వెయ్యికోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇందులో సుమతిగా గర్భవతి పాత్రలో దీపికా పదుకొనె నటించింది. అయితే `కల్కి 2` నుంచి ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. డేట్స్, కాల్షీట్లు, పారితోషికం వంటి కారణాలతో ఆమె తప్పుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రొడక్షన్ వైజయంతి మూవీస్ ప్రకటించింది.
35
దీపికా పదుకొనె స్థానంలో సాయిపల్లవి?
దీపికా పదుకొనె తప్పుకోవడంతో ఆమె స్థానంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా సాయిపల్లవి ఫైనల్ అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని సమాచారం. ఇందులో ప్రభాస్‌తో కలిసి సాయిపల్లవి నటించబోతుంది. డార్లింగ్‌తో సాయిపల్లవికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో సాయిపల్లవి చేస్తే ఆమెకి గ్లోబల్ ఇమేజ్ పక్కా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో `రామాయణ` మూవీలో సీతగా నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఆయన రాముడిగా కనిపించబోతున్నారు. యష్ రావణుడిగా నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తారు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది.
55
రజనీకాంత్ మూవీలో సాయిపల్లవి
`రామయణ` మూవీ రెండు భాగాలుగా రాబోతుందని ఇప్పటికే టీమ్ ప్రకటించారు. ఈ ఏడాది ఒక పార్ట్, వచ్చే ఏడాది మరో పార్ట్ రాబోతుంది. దీంతోపాటు సాయిపల్లవి కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీని కమల్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ హీరో. ఇందులో కీలక పాత్రలో సాయిపల్లవి కనిపించబోతుంది. అలాగే హిందీలో `ఏక్ దిన్` అనే మరో సినిమాలో నటిస్తుంది సాయిపల్లవి. ఇలా భారీ చిత్రాలతో త్వరలో అలరించేందుకు రాబోతుంది సాయిపల్లవి.