Indian Actresses: పిల్లలను దత్తత తీసుకుని తల్లులుగా మారిన హీరోయిన్లు

Published : Jan 29, 2026, 08:22 AM IST

Indian Actresses: మన హీరోయిన్లు ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకుని మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. కొందరు సింగిల్ పేరెంట్స్ గా కూడా కొనసాగుతున్నారు. పిల్లలు పుట్టని వారు, పిల్లలు ఉన్న వారు కూడా దత్తత తీసుకున్నారు. 

PREV
15
అభిరామి

అభిరామి హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో చెప్పవే చిరుగాలి, సరిపోదా శనివారు  వంటి సినిమాల్లో నటించించి.  ఆమె భర్త రాహుల్ పవనన్. వీరికి పిల్లలు లేరు.  2022లో వీరిద్దరూ ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఆమెకు కల్కి అని పేరు పెట్టారు. మొదట్లో ఆ పాప ముఖాన్ని రివీల్ చేయలేదు.  ఇటీవల నటి తన కూతురి ముఖాన్ని రివీల్ చేసింది.

25
సుస్మితా సేన్

హీరోయిన్లు దత్తల తీసుకోవడం అనే టాపిక్ వింటేనే మొదట గుర్తొచ్చేసి సుస్మితా సేన్ పేరు. ఈమె బాలీవుడ్ ప్రముఖ నటి, విశ్వసుందరి. చాలా చిన్న వయసులోనే ఆమె ఒక పాపని దత్తత తీసుకుంది. 2000 లో ఆమెను దత్తత తీసుకుని  రెనీ అని నామకరణం చేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. ఇక 2010లో రెండవ కూతురు అలీషాను దత్తత తీసుకుంది. సింగిల్ మదర్‌గా ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచింది. ఆ ప్రేమ వారి ముగ్గురిలోనూ కనిపిస్తుంది. ఇప్పటికీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు. 

35
శోభన

మలయాళం, తమిళం, తెలుగులో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది శోభన. ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ 2011లో ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని అనంత నారాయణి అని పేరు పెట్టారు. ఈమె సింగిల్ పేరెంట్ గా కొనసాగుతన్నారు. తన కూతురిని తనలాగే భరతనాట్య కళాకారిణిగా మార్చింది.  ఇటీవల తల్లీకూతుళ్లు కలిసి భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. 

45
సన్నీ లియోన్

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ 2017లో నిషా కౌర్ వెబర్‌ను దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2018లో సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు తల్లి అయ్యారు. తన కొడుకులతో సమానంగా నిషాను ఎంతో ప్రేమగా పెంచుతోంది సన్నీ లియోన్. ఆమె వీడియోలను తన ఇన్ స్టా ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూనే ఉంటుంది. ఆమెకు విడిగా ఇన్ స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది.

55
రవీనా టాండన్

రవీనా టాండన్‌ కేవలం 21 ఏళ్ల వయసులోనే ఇద్దరు పిల్ల్ని దత్తత తీసుకున్నారు. అప్పటికి ఆమెకు పెళ్లి కూడా కాలేదు. ఇప్పుడు వారిని చూస్తే రవీనాకు చెల్లెళ్లలాగా ఉంటారు. ఎందుకంటే రవీనాకు దత్తత తీసుకున్న పిలలకు మధ్య వయసు తేడా చాలా తక్కువ. తన దూరపు బంధువు మరణం తర్వాత వారి ఇద్దరు పిల్లలనే రవీనా దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వారికి పిల్లలు కూడా పుట్టారు. అంటే రవీనా అమ్మమ్మ కూడా అయిపోయింది. రవీనాకు పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టారు. 

Read more Photos on
click me!

Recommended Stories