ఇదిలా ఉంటే అనుష్కని సినిమాలకు పరిచయం చేసింది నాగార్జుననే అనే విషయం తెలిసిందే. యోగా టీచర్‌గా పనిచేస్తున్న అనుష్కని చూసి `సూపర్` సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఆమెకి ఆడిషన్ చేసి, యాక్టింగ్ వస్తుందో రాదో టెస్ట్ చేసి ఎంపిక చేద్దామన్నాడట దర్శకుడు పూరీ జగన్నాథ్. కానీ నాగ్ అక్కర్లేదు, మనమే ట్రైనింగ్ ఇద్దామని చెప్పాడట.
బహుశా ఆమె అందానికి అంతగా పడిపోయాడేమో నాగ్. అందుకే ఆమెని చూడగానే హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. పెద్ద హీరోయిన్‌ని చేశాడు. ఆమెతోనే ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ఐదారు సినిమాలు అనుష్కతోనే చేయడం విశేషం. దీన్ని బట్టే ఆయనకు అనుష్క ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. హైట్, గ్లామర్, అభినయం, ఇన్నోసెంట్ నాగ్‌ని ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.