Rukmini Vasanth: యశ్, ఎన్టీఆర్ తర్వాత రుక్మిణి వసంత్‌ క్రేజీ ప్రాజెక్ట్స్... కన్నడ బ్యూటీ రచ్చ వేరే లెవల్‌

Published : Aug 12, 2026, 09:18 PM IST

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆమె చేతిలో ఇప్పుడు క్రేజీ లైనప్‌ ఉంది.

PREV
16
పాన్-ఇండియా స్థాయిలో సత్తా

కన్నడ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి రుక్మిణి వసంత్, ఇప్పుడు వరుస సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో సందడి చేస్తున్నారు. విభిన్నమైన పాత్రలు, సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. సప్త సాగరములు దాటి మూవీతో పాపులర్‌ అయిన ఈ అమ్మడు `కాంతార 2`తో పాన్‌ ఇండియా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్‌ కేక్‌గా మారిపోయారు.

26
‘బీర్బల్’తో హీరోయిన్‌గా ఎంట్రీ
రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా 'బీర్బల్'తో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీలో 'అప్‌స్టేర్స్' అనే సినిమాలో కూడా నటించి తన పరిధిని విస్తరించుకున్నారు. కానీ, రుక్మిణి కెరీర్‌కు అసలైన టర్నింగ్ పాయింట్ 2023లో వచ్చింది.
36
‘సప్త సాగరదాచె ఎల్లో’తో బిగ్ బ్రేక్!
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరదాచె ఎల్లో' సినిమా రుక్మిణి వసంత్ కెరీర్‌కు కొత్త మలుపు ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా విజయంతో రుక్మిణికి కన్నడలోనే కాకుండా, ఇతర దక్షిణాది భాషల నుంచి కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
46
‘కాంతార: చాప్టర్ 1’తో పాన్-ఇండియా గుర్తింపు

హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార: చాప్టర్ 1'లో కూడా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో, నిఖిల్ సిద్ధార్థ్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.

56
యశ్ ‘టాక్సిక్’లోనూ రుక్మిణి!

రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' కూడా ఒకటి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో రుక్మిణి కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ సినిమా ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

66
జూ.ఎన్టీఆర్‌తోనూ భారీ సినిమా!

రుక్మిణి వసంత్ సినీ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఒకవైపు యశ్‌తో 'టాక్సిక్', మరోవైపు జూ.ఎన్టీఆర్‌తో 'డ్రాగన్'... ఇలా వరుసగా పెద్ద సినిమాలు రుక్మిణి చేతికి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. బాలీవుడ్‌ నుంచి ఆమెకి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories