Irumudi Trailer Review: కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published : Aug 12, 2026, 08:46 PM IST

Irumudi Trailer Review: రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ ట్రైలర్‌ వచ్చింది. ఇది ఆసక్తికరంగా సాగింది. రవితేజ స్టయిల్‌ మాస్‌ మసాలా మూవీస్‌కిది భిన్నంగా ఉండటం విశేషం.

PREV
14
రవితేజ ఇరుముడి ట్రైలర్‌ వచ్చింది

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుడి కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 21న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. పూర్తిగా ఇది శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తో, ఇంటెన్సిటీతో సాగుతుందని తెలుస్తోంది.

24
ఇరుముడి మూవీ ట్రైలర్‌ ఎలా ఉందంటే

ట్రైలర్‌ లో ఏం చూపించారనేది చూస్తే, రవితేజ కూతురు స్కూల్‌కి వెళ్తుంటుంది. ఆమెనే ప్రాణంగా బతుకుతుంటాడు రవితేజ. ఆయన ఆటో నడిపిస్తుంటాడు. ఆయన భార్య ప్రియా భవానీ శంకర్‌ నటించింది. రవితేజ ప్రతి ఏడాది అయ్యప్పస్వామి మాల ధరిస్తుంటాడు. అదే సమయంలో మాల లేనప్పుడు ఆల్కహాల్‌ బాగానే తీసుకుంటాడు. అదే ఓ సమస్యగా మారుతుంది. అయితే తన కూతురు ఐదో తరగతి పూర్తి చేసిందని చెప్పి ఫంక్షన్‌ కూడా చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆడపిల్లలకు ఆ ఊర్లో భద్రత లేదు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు కొందరు దుండగులు. వారి నుంచి రవితేజ కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు.

34
కూతుళ్ల కోసం తండ్రి పోరాటం

తన ఒక్క కూతురునే కాదు, ఊర్లో అందరు ఆడపిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటాడు. మరి ఈ క్రమంలో చోటు చేసుకునే ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ సినిమా అని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మాల వేసినప్పుడు పద్ధతిగా, భక్తితో ఉండే రవితేజ మాల తీస్తే మాత్రం శత్రువులకు యముడిగా మారిపోతుంటాడు. అయితే తండ్రిని చూసి ఓ దశలో కూతురు కూడా భయపడుతుంది. ఇలాంటి ఎమోషనల్‌ అంశాలు, యాక్షన్‌ అంశాలు, సెంటిమెంట్‌, ఫ్యామిలీ అంశాల మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. రవితేజ ఇటీవల నటిస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఓ వైపు భక్తిరస చిత్రంగా, మరోవైపు కూతురుని కాపాడుకోవడం కోసం తండ్రి పడే ఆరాటం, పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుంది.

44
ఈ నెల 21న ఇరుముడి రిలీజ్‌

ట్రైలర్‌ మాత్రం ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పొచ్చు. రవితేజ నటించే రొటీన్‌ కమర్షియల్‌, మాస్‌ మసాలా మూవీస్‌కిది భిన్నంగా ఉండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సారి రవితేజకి హిట్‌ గ్యారంటీ అనే ఫీలింగ్‌ని ఇస్తుంది. మరి థియేటర్లో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. దర్శకుడు శివ నిర్వాణ `ఖుషి` తర్వాత చేస్తోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదలవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories