పెద్ద హీరోలు, భారీ బడ్జెట్, విపరీతమైన హైప్ లాంటివి ఏమీ లేకుండా.. కేవలం మంచి కథతో మనసు దోచుకున్న ఈ 5 సౌత్ ఇండియన్ సినిమాలను మీ కుటుంబంతో కలిసి చూసేయండి. వీటిలో ఆనంద్ దేవరకొండ సినిమా కూడా ఉంది.
1. సూడానీ ఫ్రమ్ నైజీరియా: ఫుట్‌బాల్ ప్లేయర్‌కు, కేరళ ఫ్యామిలీకి మధ్య ఇంత ప్రేమా?
మలయాళంలో వచ్చిన 'సూడానీ ఫ్రమ్ నైజీరియా' సినిమా ఇది. కేరళలోని ఓ లోకల్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆడే నైజీరియా ప్లేయర్ గాయపడతాడు. అతడిని ఓ కుటుంబం తమ ఇంట్లో ఉంచి చూసుకుంటుంది. అన్ని వయసుల వారు చూసేలా 'U' సర్టిఫికెట్ కూడా పొందింది. ఆహాలో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
25
2. మిడిల్ క్లాస్ మెలోడీస్: హోటల్ పెట్టాలనుకున్న కుర్రాడి సరదా కథ!
ఓ చిన్న ఊరిలో టిఫిన్ సెంటర్ నడిపే రాఘవ, నగరంలో సొంతంగా హోటల్ ప్రారంభించాలని కలలు కంటాడు. ప్రేమ, కుటుంబం, వ్యాపారం, ఆర్థిక ఇబ్బందులు వంటి మధ్యతరగతి జీవితాన్ని కామెడీతో చూపించే ఈ తెలుగు సినిమా ఇది. ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
1980ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ ఊరిలో దాచిపెట్టిన పురాతన నిధి కోసం ఓ విచిత్రమైన పోలీస్ అధికారి వెతుకుతుంటాడు. ఈ క్రమంలో దొంగల ముఠాతో తలపడతాడు. ఫాంటసీ, అడ్వెన్చర్, కామెడీ, మిస్టరీ కలగలిపిన ఈ కన్నడ సినిమా ప్రైమ్ వీడియో, ఆహా లలో అందుబాటులో ఉంది.
4. కవలుదారి: ఏళ్ల క్రితం జరిగిన మిస్టరీ.. దాన్ని ఛేదించే పోలీస్!
కన్నడలో వచ్చిన 'కవలుదారి' ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. బెంగళూరులో రోడ్డు విస్తరణ పనుల్లో కొన్ని పాత అస్థిపంజరాలు బయటపడతాయి. దీంతో చాలా ఏళ్ల క్రితం జరిగిన ఓ మిస్టరీ కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. ఆ తర్వాత ఓ పోలీస్ అధికారి చేసే దర్యాప్తే ఈ కథ. తమిళ డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉన్న ఈ సినిమా, థ్రిల్లర్ ప్రియులతో కలిసి చూడటానికి మంచి ఛాయిస్. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
55
5. థింకలజ్చ నిశ్చయం: ఓ పెళ్లి నిశ్చితార్థం.. ఇంట్లో జరిగే రచ్చ!
ఓ అమ్మాయి పెళ్లి నిశ్చితార్థం కోసం కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరతారు. కానీ, ఆ ఒక్క ఈవెంట్ చుట్టూ కుటుంబంలో వచ్చే అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనలతో కథ మొత్తం సందడిగా సాగుతుంది. సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.