
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రుక్మిణి కోపంగా మాధవ్ దగ్గరికి వెళ్లి షర్టు పట్టుకొని దేవి ఎక్కడ?ఎక్కడ దాచావు అని అనగా, నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు రాధ? అయినా నాతో ఇంత కోపంగా మాట్లాడుతూ ఆదిత్యతో మాత్రం ఎందుకు అంత ప్రేమగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మాధవ్ మాటలు విన్నా రథ చాలా కోపంతో, నేను దేని గురించి మాట్లాడుతున్నాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ దేవి మనసులో ఏదైనా అలజడి సృష్టించావా ఏదైనా తప్పుడు విషయాలు చెప్పావా?అని అడుగుతుంది.నేను మా అమ్మ మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తాను కాని నీకు మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పను రాధ నా జీవితంలో అందరికన్నా నువ్వే నాకు ఎక్కువ అని అనగా, దేవి కనపడకపోవాలి అప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పి రుక్మిణి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ లో ఆదిత్య ఆలోచించుకుంటూ దేవి ఎలాగున్నాదో ఏంటో దేవి దగ్గరకు వెళ్లి నేనే తన నాన్నని అని జరిగిన విషయం అంతా చెప్పేస్తాను ఏదైతే అది అయింది అనుకొని గది బయటకు వెళ్తాడు.అప్పుడు రాజమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అనగా బయటకు వెళ్తున్నాను పిన్ని అని అంటాడు ఆదిత్య.
దానికి రాజమ్మ, అక్క,సత్య గుడికి వెళ్ళడానికి నీ కార్ తీసుకొని వెళ్లారు కొంతసేపు ఇంట్లోనే ఉండు అని అనగా, ఇదంతా నీ వల్లే వచ్చింది రుక్మిణి చిన్నప్పుడే నువ్వు నన్ను వొదిలి వెళుతున్నప్పుడు దేవిని కనీసం నా ఇంటి గుమ్మం ముందు పెట్టినా ఇప్పుడు దేవి మహారాణిలా పెరిగేది అని అనుకోని ఆలోచనలలో పడతాడు. అప్పుడు రాజమ్మ, ఆదిత్య నువ్వు నా అక్క కొడుకువి అంటే నా కొడుకువే అనుకోని చనువుతో చెప్తున్నాను నీ జీవితంలోకి ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకరు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఇప్పుడు వేరే ఏ అమ్మాయి వల్ల మీ ఇద్దరి మధ్య బంధం పోకూడదని కోరుకుంటున్నాను. సత్య నీ మీద ఎన్నో అసలు పెట్టుకుంది అని చెప్తుంది రాజమ్మ. ఆ తర్వాత సీన్లో రుక్మిణి వీధులలో తిరుగుతూ దేవీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు దేవి కనిపించడం లేదు అని పెనిమిటికి చెప్తే పరేషాన్ అయితాడు అని అనుకొని చెప్పకుండా వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో జరిగిన విషమంతా గుర్తుతెచ్చుకుంటూ సత్య కారులో ఆదిత్య గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో రాధ వీధి బయట తిరగడం చూస్తుంది సత్య.
అక్క బయట ఉన్నదంటే ఆదిత్య కోసమే వెళ్తున్నట్టు ఉన్నాది ఇంత చెప్పినా వాళ్ళిద్దరూ కలవడం మానడం లేదు. ఆదిత్య కూడా అక్క కోసమే వెతుక్కుంటూ ఉంటాడేమో అని అనుకుంటుంది.అదే సమయంలో కారు దాటి వెళుతుంది రుక్మిణి. అప్పుడు దేవుడమ్మ, ఒకసారి ఆపమని డ్రైవర్ కి చెప్తుంది. ఎందుకు అని సత్య అడగగా, ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్లినట్టు అనిపించింది అని అంటుంది దేవుడమ్మ. అప్పుడు సత్య, అలా ఏం లేదు ఆంటీ అందరూ తెలిసిన వాళ్ళ లాగే కనిపిస్తున్నారు. గుడికి టైం అవుతుంది పోనివ్వండి అని అనగా సరే అని కారు మళ్ళీ బయలుదేరుతుంది.అప్పుడు వెనకాతల నుంచి ఆ కార్ ని చూసిన రుక్మిణి, పెనిమిటి కారులా ఉన్నది అంటే నేను వచ్చినట్టు తెలిసి కూడా కారు ఆపకుండా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ తన కుర్చీలో కూర్చుంటూ, దేవి ఎక్కడ ఉన్నది దేవుడా తనని త్వరగా తీసుకువచ్చే. రాధ ఎన్నో ఆశలు పెట్టుకున్నది తను ఇంత జీవితం బతుకుతుంది దేవి కోసమే ఇప్పుడు తను కనబడకుండా ఉంటే రాధ చాలా భయపడుతుంది అని అంటుంది.
చిన్మయి మరోవైపు దేవుడికి దండం పెట్టుకుంటూ నానమ్మ దేవి కనిపించడం లేదు అంటే ఎక్కడికి వెళ్లి ఉంటుంది. అసలకే తను ఆకలికి తట్టుకోలేదు అక్కడ భోజనం దొరుకుతుందా అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది అని అనుకుంటుంది. అదే సమయంలో రామ్మూర్తి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ దేవి ఎక్కడున్న సరే చెప్పమని చెప్తాడు. అప్పుడు రామ్మూర్తి చిన్మయితో నేను దేవి గురించి వెతకమని అందరితో చెప్పాను ఎవరైనా చూస్తే ఇంటికి తీసుకు వస్తారు అని దగ్గరికి తీసుకొని హద్దుకుంటాడు. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ, సత్య గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు.అప్పటికే ఆదిత్య ఇంటి బయట ఉంటాడు. కార్ దిగిన సత్య అక్క కోసం వెళ్లడానికి కారు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడు దేవుడమ్మ సత్యతో, గుడికి వెళ్ళిన తర్వాత సమస్యలన్నీ పోయి మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉన్నది కదా అని అంటుంది. అప్పుడు ఆదిత్య, అమ్మ నేను బయటకు వెళ్లాలి అర్జెంట్ పనున్నది అని అంటాడు. ఇంతలో దేవుడమ్మ ఒకసారి రామ్మూర్తి గారికి ఫోన్ చేయరా అని అనగా ఫోన్ చేస్తాడు ఆదిత్య. అప్పుడు దేవుడమ్మ, రామ్మూర్తి గారు మేము గుడికి వెళ్లి జానకమ్మ గారికి నయమవ్వాలని అర్చన చేయించాము.
మీరు ఎవరినైనా ఇంటికి పంపించి ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని అనగా రామ్మూర్తి దేవి కనిపించడం లేదని విషయం దేవుడమ్మకు చెప్తాడు.అప్పుడు దేవుడమ్మ ఆశ్చర్యపోయి, దేవి కనిపించడం లేదా నిన్న మధ్యాహ్నం నుంచి ఇంటికి రాలేదా అని అనగా ఆదిత్య కంగారుపడి దేవి కనిపించకపోవడం ఏంటి అని ఆలోచిస్తాడు. సరే అయితే దేవి ఇంటికి వచ్చిన వెంటనే నాకు చెప్పండి. నేను కూడా ఆదిత్యతో చెప్పి వెతకమని చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవుడమ్మ. ఆ మాటలు విన్న ఆదిత్య వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కారులో వెళ్ళిపోతాడు. అప్పుడు సత్య , ఇంకేముంది వెళ్లడానికి ఒక అవకాశం దొరికింది వెళ్లిపోయాడు అని అనుకుంటుంది. అప్పుడు దేవుడమ్మ, ఆదిత్య కి దేవి అంటే ఎంత ప్రాణము సొంత కూతురులా చూసుకుంటాడు అని అంటుంది. అప్పుడు కారులో ఆదిత్య వెళ్తూ నిన్నటి నుంచి దేవి రాలేదంటే నాకు రుక్మిణి ఎందుకు చెప్పలేదు అని కొని పోలీస్ వాళ్లకి ఫోన్ చేసి, నాకు బాగా కావాల్సిన అమ్మాయి కనిపించడం లేదు త్వరగా వెతకండి అని ఫోటో ఇస్తాడు. అప్పుడు పోలీసులు వేతుకుతాము అని అంటారు. తర్వాత రుక్మిణికి ఫోన్ చేస్తాడు ఆదిత్య.
పెనిమిటి ఫోన్ చేస్తున్నాడేంటి ఇప్పుడు దేవి గురించి అడిగితే ఏం చెప్పాలి అని అనుకోని ఫోన్ ఎత్తుతుంది రుక్మిణి. అప్పుడు ఆదిత్య రుక్మిణి తో కోపంగా మాట్లాడుతూ, దేవి కనిపించడం లేదట నిన్నటి నుంచి కనిపించకపోతే నాకు చెప్పకపోవడం ఏంటి రుక్మిణి. నా కన్న కూతురు గురించి తెలుసుకునే అర్హత కూడా నాకు లేదా? లేకపోతే చెప్పకూడదు అనుకుంటున్నావా అసలు ఎప్పుడు నుంచి అనిపించట్లేదు అని అనగా, నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసింది అంట తర్వాత ఇంటికి రాలేదు రోడ్లమీద వెతుకుతూనే ఉన్నాను.ఎక్కడా కనిపించలేదు అని రుక్మిణి చెప్తుంది. ఆ తర్వాత మాధవ్ ఇంటి బయట నించొని జరిగిన విషమంతా ఆలోచించుకుంటూ అయినా దేవి కనిపించకపోవడం ఏంటి అయితే ఇక్కడ ఉండాలి లేకపోతే ఆదిత్య ఇంటికి వెళ్ళాలి.ఆదిత్య ఇంటికి కూడా వెళ్లలేదంటే ఇంక ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు.
ఇంతలో సత్య మాధవ్ కి ఫోన్ చేసి దేవి కనిపించడం లేదట నిజమేనా అని అడగగా అవును నిన్నటి నుంచి కనిపించట్లేదు అని మాధవ్ చెప్తాడు. అప్పుడు సత్య, విషయం తెలిసిన వెంటనే ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు అని అంటుంది.అదే కదా నేను చెప్తున్నాను. కలెక్టర్ అయ్యుండి ఊర్లో పనులు చేసుకోకుండా మా ఇంటికి వ్యవహారాలు వాడికి ఎందుకు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!