టాలీవుడ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన మూవీ ప్రిన్స్ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసిన శివ కార్తికేయన్ ప్రిన్స్ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిన్స్ చిత్ర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.