Devatha: రామ్ మూర్తి కుటుంబానికి ఎదురుదెబ్బ.. మాధవకు పెళ్లిచూపులు ఏర్పాటు చేసిన రుక్మిణి!

Published : May 31, 2022, 10:43 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత  (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: రామ్ మూర్తి కుటుంబానికి ఎదురుదెబ్బ.. మాధవకు పెళ్లిచూపులు ఏర్పాటు చేసిన రుక్మిణి!

 ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవిని కలసి సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవి కూడా ఆదిత్య తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఎందుకు దేవి మౌనంగా ఉంటున్నావు. ఏమయింది అని అడగడంతో అప్పుడు దేవి, మాధవ మాట అని చెబుతూ రాధ తన తల్లి కాదని, తన తల్లి వేరే ఆవిడ అనే ఆదిత్యకు చెప్పడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు.
 

26

అప్పుడు ఆదిత్య తప్పు దేవి అలా మాట్లాడకూడదు అంటు నచ్చచెబుతాడు. మరొకవైపు రామ్మూర్తి దంపతులను, మాధవను రాధ పక్క ఊరికి తీసుకొని వెళుతుంది. అయితే రామ్మూర్తి దంపతులు ఎందుకు ఏమి అని ప్రశ్నించినా కూడా రాధ ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
 

36

అలా చివరగా రాధ మాధవ కు చెప్పకుండా తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. రామ్మూర్తి దంపతులు వెళ్లగానే పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. కానీ రామ్మూర్తి దంపతులు మాత్రం ఏం జరుగుతుందో తెలియక అయోమయం గా ఉంటారు.
 

46

ఇంతలో పెళ్లి కూతురు ఎంట్రీ ఇవ్వడం తో పెళ్లి చూపులు అని అర్ధమయ్యి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మాధవ మాత్రం కోపంతో రగిలిపోతున్న రాధ వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇక వియ్యంకుల వారి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి మాధవ నచ్చినట్టు తెలియడంతో అమ్మాయి తరఫున వాళ్లు అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందా లేదా అని అడుగుతారు.
 

56

అప్పుడు మాధవ ఇంటికి పెళ్లి కబురు పెడతాము అని తన తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళిపోతాడు మాధవ. మరొకవైపు సత్య కమల సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆదిత్య చాలా సంతోషంగా అక్కడికి వచ్చి కొత్తకొత్తగా ప్రవర్తిస్తూ ఆకలేస్తుంది అనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక మాధవ కుటుంబం ఇంటికి చేరుకున్న తర్వాత ఎందుకు ఇలా చేసావు అంటూ రాధను నిలదీస్తూ ఉంటారు.
 

66

 కానీ మాధవా మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడు రాద నీ కొడుకు గురించి ఆలోచించండి నా గురించి ఆలోచించడం పక్కనపెట్టండి అందుకే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను ఈ అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి అయినా చూసుకుందాం అని అంటుంది రాద.

click me!

Recommended Stories