Intinti Gruhalashmi: తులసిని పార్టీకి రావద్దన్నా లాస్య, నందు.. ఫోన్ చేసి మరి పిలిచిన అంకిత!

Published : May 31, 2022, 09:34 AM IST

Intinti Gruhalashmi: బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Intinti Gruhalashmi: తులసిని పార్టీకి రావద్దన్నా లాస్య, నందు.. ఫోన్ చేసి మరి పిలిచిన అంకిత!

 ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య (paramdamayya)ఆలోచిస్తు ఉండగా ఇంతలో అక్కడికి తులసి వచ్చి పరంధామయ్య ను కామెడీగా నిద్ర పోమని చెప్పగా అప్పుడు పరంధామయ్య నిద్రపోయినట్లు గా యాక్ట్ చేసి అయిపోయిందా అమ్మ తులసి(tulasi) నాకు ఇంక నటించడం రాదు అని అంటాడు.
 

27

అప్పుడు తులసి(tulasi) ఏమి జరిగింది అని అడగగా నందు విషయం ఈ విషయం గురించి బాధపడుతున్నాను అని చెబుతాడు పరంధామయ్య అప్పుడు తులసి పరంధామయ్యను ఓదారుస్తుంది. ఆ తర్వాత అంకిత పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి విష్ చేస్తుంది. అంకిత(ankitha)కూడా తులసి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
 

37

అప్పుడు అంకిత(ankitha) ఎమోషనల్ అవుతూ మీరు నా బర్త్ డే విషయం మర్చిపోయారు ఏమో అని ఇంతవరకు ఎంత టెన్షన్ పడుతున్నాను ఆంటీ మీరు ఫోన్ చేయగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది థాంక్యూ సో మచ్ ఆంటీ అని చెబుతుంది అంకిత. నా పెళ్లి అయిన తరువాత రాత్రి 12 గంటలకు నా బర్త్ డేకీ మీ విషెస్ అందుకోవడం నాకు అలవాటు అయ్యింది అని అంటుంది.
 

47

 మా అమ్మ, అభి కూడా చెప్పరు. ఇంతలో అక్కడికి దివ్య (divya)వచ్చి అంకితకు బర్త్డే విషెస్ చెబుతుంది. అప్పుడు అంకిత బర్త్డే పార్టీ కి వస్తున్నారు కదా అని అనడంతో తులసి(tulasi) మళ్లీ వస్తాము అని అనగా అప్పుడు దివ్య జరిగింది మొత్తం అంకితకు చెబుతుంది. మీరు ఎలా అయినా పార్టీకీ రావాలి అని బలవంత పెడుతుంది మీరు రాకపోతే నేను కేక్ కూడా కట్ చేయను అని అంటుంది అంకిత.
 

57

మరొకవైపు అభి అంకిత(ankitha )కోసం నెక్లెస్ తీసుకొని వస్తాడు. అప్పుడు అంకితం నీ డబ్బులతో కొనింది అయితే ఇవ్వు లేకపోతే వద్దు అని అంటుంది. అప్పుడు అభి(abhi) నేను నా డబ్బులతో ప్రేమతో కొన్నాను అని చెప్పి అంకిత మెడలో వేస్తాడు. అప్పుడు అంకిత తులసి ఆంటీ వాళ్లను పార్టీకి ఇన్వైట్ చెయ్ అని చెబుతుంది. మరొకవైపు అంకిత ప్రేమ్, శృతి లను పార్టీ కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తుంది.
 

67

 మరోవైపు పరంధామయ్య, అనసూయ(anasuya) వచ్చి తులసిని అది కావాలి ఇది కావాలి అని అడగగా తులసి మాత్రం పట్టించుకోకుండా సమాధానాలు చెబుతుంది. అప్పుడు తులసి(tulasi)అంకిత కోసం చీర కుడుతున్నాను అని అంటుంది. అంతేకాకుండా మనం పార్టీ కి వెళ్తున్నాం అని గట్టిగా చెబుతుంది. మరొకవైపు లాస్య, నందులు బర్త్డే పార్టీ కి వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు లాస్య అంకిత కోసం ఒక ఖరీదైన చీరను బహుమతిగా ఇవ్వాలి అనుకుంటుంది.
 

77

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య (lasya)తాను తెచ్చిన గిఫ్ట్ ను అంకితకు ఇస్తుంది. ఆ తర్వాత తులసి(tulasi) కూడా చీర తెచ్చి ఇవ్వడంతో అప్పుడు అంకిత ఈ చీర నాకు బాగా నచ్చింది కేక్ కట్ చేసేటప్పుడు నేను ఈ చీర కట్టుకుంటాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

click me!

Recommended Stories