సినిమా ఫ్లాప్ అయితే చంకలు గుద్దుకోవడం ఏంటో, ఇండస్ట్రీ వాళ్లే.. ఎఫ్3 మూవీపై అలీ షాకింగ్ కామెంట్స్

Published : May 31, 2022, 09:42 AM IST

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అనిల్ తాజాగా తెరకెక్కించిన ఎఫ్3 చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

PREV
16
సినిమా ఫ్లాప్ అయితే చంకలు గుద్దుకోవడం ఏంటో, ఇండస్ట్రీ వాళ్లే.. ఎఫ్3 మూవీపై అలీ షాకింగ్ కామెంట్స్

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అనిల్ తాజాగా తెరకెక్కించిన ఎఫ్3 చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. 

 

26

చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై నెగిటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. కొందరు పని కట్టుకుని మరీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఇటీవల అనిల్ రావిపూడి కూడా కామెంట్స్ చేశారు. 

36

ఎఫ్3 సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అలీ కూడా అలాంటి కామెంట్స్ చేసారు. అలీ తనదైన శైలిలో కొంచెం ఘాటుగా స్పందించాడు. ఎఫ్ 3 చిత్రానికి సోమవారం రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయని అలీ అన్నారు. అది తెలిసి నటులుగా మేమంతా చాలా సంతోషించాం. ఎందుకంటే మాకు సినిమా తప్ప మరో వ్యాపారం తెలియదు అని అలీ అన్నారు. 

46

కానీ కొందరు బాగున్న సినిమాకి కూడా బాగా లేదని ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేస్తున్న వారు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అలీ అన్నారు. గతంలో చెన్నై లో ఉన్నప్పుడు ఇలాంటినెగిటివ్ థాట్స్ ఉండేవి కాదు. 

56

ఈ మధ్యకాలంలోనే ఇది ఎక్కువైంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా వాళ్ళు చంకలు గుద్దుకోవడం ఏంటో అని అలీ అన్నారు. దయచేసి ఇలాంటి మానేయండిరా బాబు.. ఒకరికి మంచి జరగాలని కోరుకుంటే అంతకు మించిన మంచి మీకు కూడా జరుగుతుంది అని అలీ అన్నారు. 

66

అలీ తన పాత్ర గురించి సరదాగా మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా తాను నటించిన గన్ సన్నివేశం గురించి అడుగుతున్నారు అని అలీ అన్నారు. ఇక వేదికపై వెంకీతో జోకులు వేశాడు. సుబ్బారావు పెళ్ళాం ఏంటి అని అడగగా.. వెంకీ సుబ్బారావు కాదు వెంకట్రావు అని గుర్తు చేశారు. ఓహో అయితే ఎఫ్4 లో సుబ్బరావు పెళ్ళాం అన్నమాట అంటూ నవ్వులు పూయించారు. 

click me!

Recommended Stories