Devatha: మాధవ ఇచ్చిన చీరను విసిరికొట్టిన రాధ.. కనిపించకుండా పోయిన దేవి?

Published : Jul 27, 2022, 11:26 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: మాధవ ఇచ్చిన చీరను విసిరికొట్టిన రాధ.. కనిపించకుండా పోయిన దేవి?

ఈరోజు ఎపిసోడ్ లో అమెరికా ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు సత్య(sathya) బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతూ ఉంటారు. కమలా కూడా డెలివరీ డేట్ దగ్గర పడింది కమలకు బిడ్డ పుడుతుంది అప్పుడు నువ్వు కచ్చితంగా ఉండాలి అని అంటుంది దేవుడమ్మ(devudamma). ఇక రేపు నీతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తాను అని సత్యతో చెబుతుంది దేవుడమ్మ.
 

26

అప్పుడు ఎన్ని పూజలు చేసిన ఏం లాభం ఆంటీ ఎన్నో పూజలు చేసింది నాతో కూడా ఎన్నో పూజలు చేయించింది కానీ ఇప్పటివరకు మనకు ఏం మంచి జరిగింది అని అంటుంది సత్య(sathya). అప్పుడు దేవుడమ్మ(devudamma)అలా మాట్లాడకూడదు సత్య కోరికల కోసం మనం వ్రతాలు చేయకూడదు వ్రతం చేస్తే మనకు మంచి జరుగుతుంది అని సత్యకు నచ్చచెబుతుంది.
 

36

ఇంతలోనే అక్కడికి ఆదిత్య(adithya)రావడంతో వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతుంది. అప్పుడు భాష వరలక్ష్మీ వ్రతం కి కావాల్సిన ఏర్పాట్లు అని హడావిడిగా చేస్తూ ఉండగా ఆదిత్య సత్య ల కోసం దేవుడమ్మ కొత్త బట్టలు తెస్తుంది. మరొకవైపు ఇంట్లో పూజకు సంబంధించిన సామాన్లను జానకి శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో రాధ(radha)అక్కడికి వచ్చి ఈ పనులు అన్ని నేను చేస్తాను కదా అని అంటుంది.
 

46

 అప్పుడు వెంటనే జానకి(janaki) ఈ వయసులో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవాలి కదా అని అంటుంది. అప్పుడు రామ్మూర్తి అక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లు అన్ని ఎందుకు అని అడగగా రేపు గుడిలో వరలక్ష్మీ వ్రతం అని చెబుతుంది జానకి. అప్పుడు వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన ఏర్పాటను చూసుకోవడానికి రామ్మూర్తి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత జానకి రాధక(radha)కొత్త చీర తెచ్చి ఇవ్వగా మాధవ చాటున ఉంది గమనిస్తూ ఉంటాడు.
 

56

అప్పుడు రాధ(radha)కి అనుమానం వచ్చి ఈ చీర మాధవ తెచ్చారు కదా అని అనగా జానకి చెప్పడానికి తడబడడంతో వెంటనే రాధ చీరను తీసుకోను అంటూ మొఖం మీద చెప్పేస్తుంది. మరొకవైపు దేవుడమ్మ ఆదిత్యకు నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉండగా ఆదిత్య చిన్న పిల్లవాడిలా మారం చేస్తూ ఉంటాడు. మరొకవైపు దేవి(devi), చిన్మయి లు కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతూ ఉంటారు.
 

66

ఆ తర్వాత దేవి(devi)ఆలోచిస్తూ ఉండగా అది చూసిన రాధ తండ్రి గురించి ఆలోచించి అలా ఉంది అని అనుకుంటుంది. మరొకవైపు దేవుడమ్మ ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరూ తమ మనసులో కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు జానకి (janaki)వాళ్ళు కూడా గుడిలో పూజలు చేయిస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక ఆమె జానకిని మీ చిన్న మనవరాలు రాలేదా అని అడగగా రాధ ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు దేవి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

click me!

Recommended Stories