అనన్య పాండే , విజయ్ దేవరకొండను ఇరకాటంలో పడేసిన కరణ్ జోహార్, డేటింగ్ విషయం నిజమేనా..?

Published : Jul 27, 2022, 10:38 AM ISTUpdated : Jul 27, 2022, 10:54 AM IST

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అదే కాఫీవిత్ కరణ్ షో ప్రోమోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండేల కామెంట్స్, వారిద్దరిని కరణ్ జోహార్ ఆడుకున్న విధానం. డేటింగ్, సెక్స్.. ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి.

PREV
18
అనన్య పాండే , విజయ్ దేవరకొండను ఇరకాటంలో పడేసిన కరణ్ జోహార్,  డేటింగ్  విషయం నిజమేనా..?

రీసెంట్ గా బాలీవుడ్ లో  కాఫీ విత్ కరణ్ షో  7 సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈసారి బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ ను కూడా ఒక ఆట ఆడుకుంటున్నాడు హోస్ట్ కరణ్ జోహార్. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్  అయిపోయాయి. ఈ సారి కరణ్ ప్రశ్నలకు స్టార్స్ బిత్తరపోవాల్సి వస్తోంది.  

28

తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు విజయ్ దేవరకొండ తన హీరోయిన్  అనన్య పాండే తో  కలిసి జాయిన్ అయ్యాడు. ఈ ఇక దీనికి సంబంధించిన  ప్రొమో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది, అందులో అనన్య, విజయ్‌ దేవరకొండకు కరణ్ మైండ్ బ్లాక్ అయ్యేలా  ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 

38

ముందుగా  విజయ్ దేవరకొండ డేటింగ్ , క్రష్, సెక్స్ లాంటి విషయాలపై ఉక్కిరిబిక్కిరి చేశాడు కరణ్ జోహార్.  ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు విజయ్ పై  తమకు క్రష్ ఉన్నట్లు ఓపెన్‌గానే చెప్పారు.  అంతకు ముందు కరణ్ షోలో జాన్వీ కపూర్,సారా అలీఖాన్ విజయ్ దేవరకొండ చీజ్ లాగా ఉంటాడంటూ  కామెంట్లు చేశారు. ఇక ఆ విషయంపై విజయ్ ను ఇరకాటంలో పెట్టాడు కరణ్. 

48

జాన్వీ, సారా మాట్లాడిన వీడియోలు చూపిస్తూ.. విజయ్‌ను కరణ్ నీకు చీజ్ ఇష్టమా అంటూ ప్రశ్నించాడు కరణ్. డేటింగ్ విషయంపై విజయ్ ఇరకున పడటంతో.. ఇది ఎక్కడివరకూ వెళ్తుందో అంటూ విజయ్ నసగడం ప్రమోలో చూడటవచ్చు. అంతే కాదు విజయ్ ను సెక్స్ గురించి అడగ్గా..  అనన్య పాండే  స్పందించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక వెంటనే అనన్యను టార్గెట్ చేశాడు కరణ్. 
 

58

అనన్యకు మోహం మీద షాక్ ఇచ్చేలా ఓ ప్రశ్న వేశాడు. నా పార్టీలో నువ్వు ఆదిత్య రాయ్ కపూర్. కలిసి ఏం చేస్తున్నావంటూ... అడిగేశాడు. అయితే కరణ్ ప్రశ్నకు అడ్డు తగులుతూ.. స్టాప్ స్టాప్ నువ్వుఏం చూడలేదు.. నేను ఏం చేయలేదు అంటూ..అడ్డు తగిలింది అనన్య. 
 

68

కరణ్ జోహార్ అనన్యను ప్రశ్నిస్తు.. నీకు నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ఏం జరుగుతోంది అని అడిగాడు. ఆ ప్రశ్న వేయగానే.. విజయ్ ఓహ్.. అంటూ అనన్య ముఖం చూశాడు.ఇక అనన్య కూడా మొహం వాడిపోయేలా పెట్టింది. అయితే కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా కనీసం ఖండించలేదు అనన్య. దాంతో ఆదిత్యరాయ్ కపూర్ తో అనన్య డేటింగ్ నిజమేమో అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. 

78

ఇక నెటిజన్లు ఈ వార్తపై స్పందిస్తున్నారు. అనన్య డేటింగ్ పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ జంట బాగోదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ,మరికొందరు.. కరణ్ ఎవరికి పడితే వారికే లింకులు పెట్టాస్తాడంటూ.. మండిపడుతున్నారు. 

88

ఇక హాట్ హాట్ గా జరుగుతోంది కాఫీ విత్ కరణ్ షో.. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆలియా భట్, రణ్వీర్ సందడి చేశారు.ఇక  సెకండ్ ఎపిసోడ్ జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ అటెండ్ అయ్యారు.ఇక మూడవ ఎపిసోడ్‌లో సమంత, అక్షయ్  సందడి చేశారు. ఈ సారి మాత్రం విజయ్ దేవరకొండ, అనన్య ఎపిసోడ్ కోసం దేశ వ్యాప్తంగా ప్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories