Samantha: చరణ్ మరదలు పెళ్ళిలో సమంత సందడి... క్లోజ్ ఫ్రెండ్ తో పాటు హాజరైన స్టార్ లేడీ

Published : Dec 10, 2021, 12:55 PM ISTUpdated : Dec 10, 2021, 12:57 PM IST

దోమకొండ విలేజ్ స్టార్స్ తో పోటెత్తింది. అక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకలో టాలీవుడ్ టాప్ స్టార్స్ సందడి చేస్తున్నారు. దీంతో దోమకొండలో పండుగ వాతావరణం నెలకొంది.   

PREV
17
Samantha: చరణ్ మరదలు పెళ్ళిలో సమంత సందడి... క్లోజ్ ఫ్రెండ్ తో పాటు హాజరైన స్టార్ లేడీ

ఉపాసన కొణిదెల (Upasana Konidela)చెల్లెలు అనుష్పాల వివాహ వేడుకలకు దోమకొండ గ్రామం వేదిక అయ్యింది. ఉపాసన దోమకొండ సంస్థానానికి చెందిన వారు. దీంతో దోమకొండ గడీలో ఈ పెళ్లి వేడుక ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఈ దోమకొండ సంస్థానం ఉంది. 
 

27

మరదలు అనుష్పాల వివాహానికి రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా పక్కనపెట్టి ఈ పెళ్లి వేడుకకు హాజరు కావడం జరిగింది. ఆ ఇంటి పెద్ద అల్లుడిగా రామ్ చరణ్ పెళ్లి వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ వేదికలో చరణ్ పాల్గొనలేదు. 


 

37

ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరగాల్సిన ప్రెస్ మీట్ ని రామ్ చరణ్ లేని కారణంగా వాయిదా వేసినట్లు సమాచారం. కాగా ఈ పెళ్లి వేడుకకు సమంత హాజరు కావడం ప్రత్యేకంగా నిలిచింది. సమంత తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు అనుష్పాల వివాహానికి హాజరయ్యారు. 
 

47


చరణ్ భార్య ఉపాసనకు సమంత (Samantha)అత్యంత ఆప్తురాలు. శిల్పారెడ్డి కుటుంబంతో కూడా ఉపాసనకు చాలా కాలంగా అనుబంధం ఉంది. దీపావళి వేడుకలను సైతం శిల్పారెడ్డి, ఉపాసన, సమంత కలిసి జరుపుకున్నారు. ఫిట్నెస్, ఫ్యాషన్, డైట్ వంటి విషయాలలో ముగ్గురికి కామన్ ఇంట్రెస్ట్ ఉంది. 

57

స్లీవ్ లెస్ జాకెట్, మిల్క్ పింక్ శారీ ధరించిన సమంత పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆమె సమంత అందం సదరు డిజైనర్ శారీలో మరింత ఇనుమడించింది. సమంత పర్సనల్ స్టైలిష్, డిజైనర్ ప్రీతమ్ ఆ డ్రెస్ డిజైన్ చేసినట్లు సమాచారం. 

67

ఇక పెళ్ళిలో ఉపాసన బంధువులు, కుటుంబ సభ్యులతో సమంత ఫోటోలకు ఫోజులిచ్చారు. హీరో రామ్ చరణ్ సతీసమేతంగా సమంతతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సెలెబ్రిటీ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

77

కాగా సమంత త్వరలో షూటింగ్స్ తో బిజీ కానున్నారు. ఆమె వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించగా.. అన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక పుష్ప మూవీలో సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఈ సాంగ్ విడుదల కానుంది.

Aslo read Samantha: జబ్బలు జాకెట్ లో హాట్ క్లీవేజ్ షో.. అదిరిపోయే అందాలను సరికొత్తగా చూపిస్తున్న సమంత

Aslo read Samantha: నా జీవితానికి గట్టి ఎదురుదెబ్బ, విభేదాలు సహజం.. అసభ్య కామెంట్స్ పై సమంత

click me!

Recommended Stories