Karthika Deepam: పిల్లల ప్రశ్నలు.. కార్తీక్ కన్నీళ్లు.. ఎట్టకేలకు లేడీ విలన్ మనసు గెలిచిన వంటలక్క?

Navya G   | Asianet News
Published : Dec 10, 2021, 11:07 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Karthika Deepam: పిల్లల ప్రశ్నలు.. కార్తీక్ కన్నీళ్లు.. ఎట్టకేలకు లేడీ విలన్ మనసు గెలిచిన వంటలక్క?

దీప (Deepa)  పిల్లలిద్దరితో తనకు సహాయం చేయమని.. సహాయం చేస్తే నాన్న సీక్రెట్ గా గిఫ్ట్ ఇస్తాడని అంటుంది. ఇక సౌందర్య, ఆనందరావు (Anadharao) ఆలోచిస్తూ ఉండగా శ్రావ్య వచ్చి ఇంకేం మిగిలుందని బాధపడుతున్నారని అంటుంది.
 

210

దీపక్క (Deepa) ఎప్పుడు కూడా కడుపునిండా తినలేదని, సుఖంగా నిద్రపోలేదని అంటూ ఎమోషనల్ అవుతుంది. పెళ్లి తర్వాత పదకొండేళ్లు విడిపోయారని ఆ తర్వాత మోనిత, ఇప్పుడు మోనిత (Monitha) బిడ్డ అంటూ కొన్ని రోజులైతే మోనిత తన బిడ్డతో ఇక్కడే మకాం వేస్తుందని అంటుంది.
 

310

సౌందర్య, ఆనందరావు (Anadharao) ఆలోచనలో పడుతారు. ఇక దీప, పిల్లలు ఇల్లు బయట శుభ్రం చేసి లోపలకు వెళ్తారు. ఇక కార్తీక్ (Karthik), పిల్లలు ఆ ఇంట్లో కాస్త ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు ఈ ఇంట్లో ఉండటం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు.
 

410

ఇక హిమ (Hima) మళ్ళీ కార్తీక్ తో గొడవ పడుతుంది. డాడీ అన్ని అబద్ధాలు చెబుతున్నాడని డాడీ వేస్ట్ అంటూ  తన మాటలతో రెచ్చిపోవడంతో దీప (Deepa) కోపంతో రగిలిపోతుంది. వెంటనే కార్తీక్ కూడా ఎమోషనల్ అవుతాడు.
 

510

దీప (Deepa) పిల్లలపై అరుస్తుంది. ఎప్పుడూ ఇలా ఎందుకు ప్రశ్నలు వేస్తుంటారు అని వారిపై అరుస్తూ బాధపడుతుంది. మీ నాన్న చాలా మంచివాడని మంచిగా చూసుకుంటాడని కార్తీక్ (Karthik) ప్రేమ గురించి చెబుతుంది.
 

610

దీప (Deepa) మాటలకు హిమ, సౌర్య ఎమోషనల్ అవుతూ మళ్లీ ఎప్పుడు ఇలా చేయము అంటూ క్షమాపణలు తెలుపుకుంటారు. ఆదిత్య కోపంతో, చిరాకు తో కనిపించడంతో శ్రావ్య (Sravya) ఏం జరిగిందని అడుగుతుంది.
 

710

బయటకు వెళ్లి అన్నయ్య గురించి అడుగుతే ఇంట్లోకి నుంచి ఆ మోనితతో (Monitha) వెళ్లిపోయాడా అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారని.. అన్నయ్య ఇలా ఎందుకు చేశాడని.. ఇప్పుడు ఇదే వంకతో మోనిత మరింత రెచ్చిపోతోందని బాధపడతాడు ఆదిత్య (Aditya).
 

810

మరువైపు దీప (Deepa) తాను ఉంటున్న ఇంటి ఓనర్ రుద్రాణి దగ్గరికి వెళ్తుంది. రుద్రాణి (Rudrani) అనే ఆవిడ ఊర్లో బాగా పలుకుబడి ఉన్న ఆవిడ లాగా ఉంటుంది. ఆమె బాగా ఆశావాది. దీంతో ఆ సమయంలో దీప ఆమె దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతుంది.
 

910

దీప (Deepa) తనని పరిచయం చేసుకొని బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాము అంటూ మీ ఇంటిని అద్దెకు ఇస్తే అందులో ఉంటామని అంటుంది. దాంతో ఆవిడ రెంట్ ఇవ్వకున్నా సరే పర్లేదు ఉండండని అంటుంది.
 

1010

ఇక దీప (Deepa) అక్కడి నుంచి వెళ్ళాక తన దగ్గర ఉన్న మనుషులు ఏంటక్క ఇలా ఫ్రీగా ఇస్తున్నావని అడిగేసరికి తన మాటలు, పద్ధతి బాగుందని తెలుపుతుంది. ఉన్నదానికంటే ఎక్కువగా వసూలు చేసుకునే రకాన్ని అంటూ తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది రుద్రాణి (Rudrani).

click me!

Recommended Stories