బిగ్ బాస్ హౌస్ లో ఘాటు రొమాన్స్ , దుప్పట్లో దూరి రెచ్చిపోయిన ఆ ఇద్దరు, హోస్ట్ ఎందుకు పట్టిచుకోవడంలేదు..?

First Published | Nov 2, 2024, 6:24 PM IST

ఇంట్లో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని చూసే రియాల్టీ షో బిగ్ బాస్. కాని అది కాస్త రోజు రోజుకు దిగజారిపోతోంది. మితిమీరిన రొయాన్స్ వల్ల ఫ్యామిలీ తో కలిసి చూడలేనిపరిస్థితి నెలకొంది. 

బిగ్ బాస్ రియాల్టీ షోకి ఇండియాలో అన్ని భాషల్లో మంచి క్రేజ్ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా బిగ్ బాస్ షోస్ నడుస్తున్నాయి. అయితే హిందీ, కన్నడ బిగ్ బాస్ లు మొదటి నుంచి నడుస్తుండగా.. తెలుగు,తమిళ, మలయాళం మాత్రం 8వ సీజన్ నడుస్తోంది. హిందీ బిగ్ బాస్ 18 సీజన్, కన్నడ బిగ్ బాస్ 11వ సీజన్ రన్ అవుతుంది. 

Also Read: మెగాస్టార్ ఫ్యామిలీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్, చిరంజీవి-మోహన్ బాబు ఎవరు లెజండ్..?
 

Bigg Boss Telugu 8


ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ఈ రియాల్టీ షో.. రకరకాల ఈవెంట్లతో అలరిస్తూ ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం 8వ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే ప్రతీ సీజన్ లో కామన్ గా ఓ లవ్ కపుల్ సందడి చేయడం సహజం. బిగ్ బాస్  హౌస్ లోకి వచ్చిన తరువాత వారి అభిప్రాయాలు కలిసి ప్రేమలో మునిగి తేలుతుంటారు. 

బయటకు వచ్చిన తరువాత ఎవరి జీవితాలు వారు చూసుకుంటారు. అయితే తెలుగు బిగ్ బాస్ లో ప్రతీ సీజన్ లో ఎవరో ఒక ప్రేమ జంట కనిపిస్తూనే ఉంటారు. వారు చేసే అతి ఒక్కొసారి ఆడియన్స్ ను ఇబ్బందిపెడుతుంటుంది.  సిరి హనుమంత్, షణ్ముక్ ల హగ్గులు.. ఆ సీజన్ లో ఆడియన్స్ కు చిరాకు తెప్పించాయి. 

Also Read:  అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..


ఇలా కొన్ని కొన్న సందర్భాలు మాత్రమే మన తెలుగు బిగ్ బాస్ హౌస్ లో వెగటుగా అనిపించాయి తప్పితే.. ఎక్కడా మనవాళ్లు హద్దులు దాటలేదు. దాటనివ్వలేదు కూడా. భార్య భర్తలుగా వచ్చినవారు కూడా మన తెలుగు బిగ్ బాస్ హౌస్ లో చాలా పద్దతిగా ఉన్నారు. ఎక్కడా హద్దులుదాటలేదు. 

కాని అప్పుడప్పుడు హగ్గుల కే మనవాళ్లు ఓవర్ అని సోషల్ మీడియాలో తిడుతుంటారు. కాని హిందీ బిగ్ బాస్ లో మాత్రం డైరెక్టర్ గా దుప్పట్లో దూరి రొమాన్స్ చేసుకుంటున్నారు కంటెస్టెంట్లు. ఆడియన్స్ చూస్తారు, తమ ఇంట్లో వారు చూస్తుంటారు అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా గలీజ్ పనులు చేస్తూ కనిపిస్తున్నారు. గత సీజన్లలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇక తాజాగా కూడా ఇలాంటి వీడియో ఒకటి బయటపడింది. 

Also Read: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు

ఇది ఒక రియాలిటీషో కదా.. మనవైపు వంద కెమెరాలు చూస్తుంటాయి. కోట్లాది ఆడియన్స్ మనల్ని చూస్తుంటారు... అనే  స్పృహ కూడా వీరిలో లేదు. సరే వీరు ముందు నుంచి తెలిసినవారా.. లవర్స్ ఆ అంటే అది కూడా లేదు.. ముక్కు మొహం తెలియని బయట వారు, హౌస్ లో పరిచయాలను పెంచుకొని, ఘాటు రొమాన్స్ చేసుకునే స్థాయికి రావడం ఎంత  దారుణమో అర్థం చేసుకోవచ్చు. 

లేటెస్ట్ గా హిందీ బిగ్ బాస్ కు సబంధించిన ఓ వీడియో  సోషల్ మీడియా వ్యాప్తంగా  వైరల్ గా మారింది. ఈ వీడియో లో ఒక అమ్మాయి అబ్బాయి దుప్పటి కప్పుకొని ఊగిపోతున్నారు. లోపల ఏమి జరిగి ఉండుంటుందో మీరు అర్థం చేసుకోగలరు. వీళ్లకు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తారు అనే భయం కూడా లేదా..? వీళ్లు ఇలా చేస్తుంటే.. 

Also Read:  గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి,

అక్కడ షో హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులను సల్మాన్ ఎలా వదిలేస్తున్నారు.. నిలదీసి కడిగేయకుండా ఎలా వదిలేస్తున్నారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ షోను చిన్నా పెద్దా, ముసలివాళ్ళతో సహా చూస్తుంటారు. మరి ఇలాంటివి కనిపిస్తే ఈ షోకు ఉన్న గౌరవం పోతుంది కదా అని అంటున్నారు. 

ఇలాంటి వాటితో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇక హిందీ బిగ్ బాస్ 17 సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా  పూర్తి చేసుకున్న  18 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. మరి ముందు ముందు అయినా ఇవి జరగకుండా చూసుకుంటారా లేదా చూడాలి.

Also Read:  అనుష్క నిర్లక్ష్యమే పెద్ద శాపంగా మారిందా..?

ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ లో కూడా రెండు ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు నడుస్తున్నాయి. యష్మి - నిఖిల్ ‌- గౌతమ్ లవ్ స్టోరీ కాగా.. అటు విష్ణు ప్రియ-పృధ్వీ  లవ్ ట్రాక్ కూడా నడుస్తోంది. కాని ఎక్కడా వీరు హద్దులు మీరలేదు. బిగ్ బాస్ గౌరవం దెబ్బతినకుండా జాగ్రత్తగా షోను నడిపిస్తున్నారు. ఇలా నడిపితేనే బిగ్ బాస్ ను రద్దు చేయాలంటూగొడవలు నడుస్తున్నాయి. అటువంటిది అంత ఘాటు రొమాన్స్ కనుక తెలుగు బిగ్ బాస్ లో కనిపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. 

Latest Videos

click me!